కర్ణాటక సంక్షోభం: సుప్రీంలో స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్

By Siva KodatiFirst Published Jul 22, 2019, 9:21 AM IST
Highlights

ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్, నగేశ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష ముగిసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

కర్ణాటక రాజకీయాం నేడు తుది అంకానికి చేరుకుంది. సోమవారం బలపరీక్ష జరగనుండటంతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్, అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ వ్యూహా ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.

ఇప్పటికే విశ్వాసపరీక్ష ఆలస్యమవుతుండటంతో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్, నగేశ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష ముగిసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

మరోవైపు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కుమారస్వామి చివరి ప్రయత్నాలకు దిగారు. ఈ సందర్భంగా జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలకు ఆయన లేఖ రాశారు. బీజేపీ ఉచ్చులో పడొద్దని .. సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందామని లేఖలో పేర్కొన్నారు. 

click me!