హాస్పిటల్ టాయిలెట్‌లో మైనర్ బాలిక ప్రసవం.. నెలలు నిండని శిశువుని ఫ్లష్ చేసిన వైనం

By telugu teamFirst Published Sep 4, 2021, 12:34 PM IST
Highlights

లైంగికదాడికి గురైన ఓ మైనర్ బాలిక ఓ ప్రైవేట్ హాస్పిటల్ టాయిలెట్‌లో ఆరు నెలల శిశువును ప్రసవించింది. అదే టాయిలెట్‌లో శిశువును ఫ్లష్ చేసి మాయం చేసింది. పిండం అవశేషాలు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ విషయాన్ని అంగీకరించిన సదరు బాలిక తనపై వయానాడ్‌కు చెందిన 20 ఏళ్ల వ్యక్తి లైంగికదాడి చేసినట్టు తెలిపింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

కొచ్చి: కేరళలోని కొచ్చిలో అవాంఛనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. లైంగికదాడికి గురైన ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. ఆమె హాస్పిటల్‌లో చెకప్ కోసం వెళ్లగా గర్భవతి అని తేలింది. ఆరు నెలల వరకూ ఆమె ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. ఆరు నెలలు నిండిన తర్వాత తల్లితో కలిసి ఓ హాస్పిటల్‌కు వెళ్లింది. అదే ప్రైవేట్ హాస్పిటల్ టాయిలెట్‌లో ఆరు నెలల శిశువును ప్రసవించింది. అంతేకాదు, టాయిలెట్‌లోనే ఆ శిశువును ఫ్లష్ చేసింది. తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా, లైంగికదాడి నిందితుడిపై కేసు నమోదైంది.

కొచ్చికి చెందిన మైనర్ బాలికపై వయానాడ్‌కు చెందిన 20ఏళ్ల యువకుడు లైంగికదాడి చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చింది. కానీ, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆరు నెలలు నిండిన తర్వాత తన తల్లితో కలిసి వెళ్లి ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చెకప్ కోసం వెళ్లింది. డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేస్తుండగా ఆ మైనర్ బాలిక వాష్ రూం వెళ్లింది. అక్కడే బాత్ రూమ్‌లో ఆరునెలల శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత టాయిలెట్‌లోనే శిశువును ఫ్లష్ చేసింది. తర్వాత వెనక్కి వచ్చి ఇంటికెళ్లారు.

ఆ టాయిలెట్‌లో శిశువు అవశేషాలు కనిపించడంతో మరో వ్యక్తి పోలీసులకు విషయాన్ని చేరవేశారు. దర్యాప్తు తర్వాత ఆ బాలికే నెలలు నిండని శిశువుకు జన్మనిచ్చిందని తేలింది. తర్వాత ఆ బేబీని ఫ్లష్ చేసి మాయం  చేయాలని భావించినట్టు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా సదరు బాలికను ప్రశ్నించగా ఆమె ఆ పనిచేసినట్టు అంగీకరించింది.

పోలీసుల వివరాల ప్రకారం, సదరు బాలిక తాను గర్భం దాల్చిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. గర్భం దాల్చి ఆరు నెలలు గడుస్తున్న సమయంలో ఆమె ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లింది. బాలికపై లైంగికదాడి జరిగినట్టు ఆమె తల్లి పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు వయానాడ్‌కు చెందిన 20ఏళ్ల వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గురువారం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కొచ్చికి తీసుకొచ్చారు. త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.

click me!