మామా, కోడళ్ల మధ్య ప్రేమ.. ఇంట్లోనుంచి పారిపోయి, చెట్టుకు ఉరేసుకుని.. విషాదాంతం..

Published : Sep 04, 2021, 11:58 AM IST
మామా, కోడళ్ల మధ్య ప్రేమ.. ఇంట్లోనుంచి పారిపోయి, చెట్టుకు ఉరేసుకుని..  విషాదాంతం..

సారాంశం

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మామా, కోడళ్లయిన వీరిద్దరూ 4 నెలల క్రితం  గ్రామం నుంచి మాయమయ్యారు.  ఇప్పుడు  వీరి మృతదేహాలు  ఇదే గ్రామంలోని ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.

ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ కు చెందిన పోలీసులు.. ఒక పురుషుడు,  ఒక స్త్రీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ చెట్టుకు ఉరి  వేసుకున్నారు. వీరు వరుసకు  మామ, కోడళ్లని, వీరి మధ్య అసహజ సంబంధం ఉందని సమాచారం. 

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మామా, కోడళ్లయిన వీరిద్దరూ 4 నెలల క్రితం  గ్రామం నుంచి మాయమయ్యారు.  ఇప్పుడు  వీరి మృతదేహాలు  ఇదే గ్రామంలోని ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.

వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులకు మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… కేఖెలూరామ్ కేవట్(50), అతనికి  కోడలు గీత (35)ల మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఖెలూరామ్ గ్రామంలో వ్యవసాయం చేస్తుండేవాడు.  

వీరి ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లోని వారికి తెలిసింది. దీన్ని గ్రహించిన వారిద్దరూ గత మార్చి నెలలో ఇంట్లో నుంచి పారిపోయారు. ఇప్పుడు వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.  ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
 
PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?