మోడీకి పుతిన్ ఫోన్: ధ్వైపాక్షిక అంశాలపై చర్చ

Published : Aug 28, 2023, 08:28 PM IST
మోడీకి  పుతిన్ ఫోన్: ధ్వైపాక్షిక అంశాలపై చర్చ

సారాంశం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు.

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు  వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సోమవారంనాడు ఫోన్ చేశారు.వచ్చే నెలలో  న్యూఢిల్లీలో  న్యూఢిల్లీలో  జరిగే  జీ20  సదస్సుకు  తాను వ్యక్తిగతంగా  హాజరు కాలేనని  పుతిన్ చెప్పారు.  ఈ సమావేశానికి  విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరౌతానని  పుతిన్ తెలిపారు. జీ20 ప్రెసిడెన్సీలో  రష్యా మద్దతుకు  పీఎం మోడీ ధన్యవాదాలు తెలిపారు.  ఈ విషయాన్ని  పీఎంఓ  ప్రకటన విడుదల చేసింది.

రెండు దేశాల  సహకారం, ఇటీవల దక్షిణాఫ్రికాలో  జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన అంశాలపై   చర్చించారు.ఇరువురు నేతలు ధ్వైపాక్షిక సహకారానికి  సంబంధించిన అనేక విషయాలపై  సమీక్షించారు.  చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంపై  ఆయన మోడీని అభినందించారు.

రష్యా అధ్యక్షుడు  బిజీ షెడ్యూల్ కారణంగా సెప్టెంబర్ మాసంలో జరిగే  జీ 20  శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేనని  క్రెమ్లిన్ శుక్రవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే.
2022 నవంబర్ లో  ఇండోనేషియాలోని బాలిలో  జరిగిన  జీ20 సమ్మిట్ కు పుతిన్ గైర్హాజరయ్యారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..