
parents killed the children in Bihar: ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నవారే కసాయి వారిగా మారారు. 16, 18 సంవత్సరాలు ఉన్న ఇద్దరు కుమార్తెల ప్రాణాలు తీశారు. నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఇద్దరు వేరే వాళ్లతో చనువుగా ఉంటున్నారనీ, అందుకే హత్య చేసినట్టు వారు పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ షాకింగ్ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. "తొలుత కూతుళ్లను తండ్రి హత్య చేశాడని తల్లి చెప్పింది. కానీ దర్యాప్తు అనంతరం తల్లిదండ్రులిద్దరూ కలిసి బాలికలను హత్య చేసినట్లు గుర్తించాం" అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సదర్) ఓం ప్రకాశ్ మీడియాకు తెలిపారు.
పోలీసులు ఈ హత్యల గురించి వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బీహార్ లోని హాజీపూర్ లో ఓ దంపతులు 18, 16 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లను హత్య చేశారు. నిద్రలోనే కూతుళ్లను హత్య చేసినట్లు తల్లి అంగీకరించినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, తల్లి రింకూ దేవి ఇద్దరు బాధితులకు దగ్గరగా కూర్చుని ఉండటాన్ని వారు కనుగొన్నారని ఎన్డీటీవీ నివేదించింది. దీంతో అధికారులు తల్లిని ప్రశ్నించగా ఇద్దరు బాలికలకు ఇతర కులాల వారితో సంబంధాలు పెట్టుకున్నారనీ, వారితో చనువుగా ఉంటున్నారని తెలిపినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే వారి ప్రాణాలు తీసినట్టు పేర్కొన్నారు.
తమకు ఏ విషయం చెప్పకుండా తరచూ ఇంటి నుంచి వెళ్లిపోవడం, వారితో సాన్నిహిత్యంగా ఉంటున్న వేరే కులాల వారు ఇంటికి దగ్గరగా వస్తుండటంతోనే కూతుళ్లను చంపేశారని ఆమె పేర్కొన్నారు. 'నేను మొదట పెద్ద కుమార్తెను చంపాను, ఆ తర్వాత చిన్న కుమార్తెను చంపాను. వీరిద్దరూ తరచూ అబ్బాయిలతో కలిసి పారిపోయేవారు. వీరు 15 రోజుల క్రితం ఇద్దరు యువకులతో కలిసి పారిపోయారు. చనిపోయే వరకు వారిని బంధించాను' అని రింకూ దేవి పోలీసుల ఎదుట అంగీకరించింది.
అంతకుముందు, "బాలికలను తండ్రే హత్య చేశారని మొదట తల్లి చెప్పింది. కానీ దర్యాప్తు తర్వాత, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి బాలికలను చంపినట్లు మేము గుర్తించామని" అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సదర్) ఓం ప్రకాష్ మీడియాకు తెలిపారు.