ఫ్రమ్ ది ఇండియా గేట్: కేటీఆర్ ప్రగల్భాలకు కేంద్రం చెక్.. కేరళకు వందే భారత్‌తో నేతల్లో డైలమా..!!

Published : Apr 16, 2023, 11:36 AM IST
ఫ్రమ్ ది ఇండియా గేట్: కేటీఆర్ ప్రగల్భాలకు కేంద్రం చెక్.. కేరళకు వందే భారత్‌తో నేతల్లో డైలమా..!!

సారాంశం

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి 22వ ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కేరళ నేతల్లో డైలమా..
కేరళలోని బీజేపీయేతర రాజకీయ పార్టీల నాయకులు ఇప్పుడు డైలామాలో ఉన్నారు. ఓ నిర్ణయాన్ని స్వాగతించాలా వద్దా? చప్పట్లు కొట్టాలా వద్దా?. వ్యతిరేకించాలా వద్దా? అనే పశ్న వారిని వెంటాడుతుంది. ఇందుకు కారణం కేరళలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో పరుగులు పెట్టడమే. ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 25న ప్రారంభించనున్నారు. అంతకు ముందు ట్రయల్ రన్ నిర్వహించి టైమ్ షెడ్యూల్‌ను పరిశీలించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ను ప్రవేశపెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  చాలా మంది బీజేపీయేతర నేతలను ఈ నిర్ణయం అయోమయంలోకి నెట్టింది. 

అయితే కేరళకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ దక్కడంపై బీజేపీ కార్యకర్తలు గరిష్ట మైలేజీని అందుకున్నారు. కేరళకు చెందిన మొదటి వందే భారత్ రైలు శుక్రవారం (విషు ముందు రోజు) తిరువనంతపురం చేరుకుంది. అయితే రైలు ఆగిన అన్ని ప్రధాన స్టేషన్లలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శుభదినమైన విషు రోజు కావడంతో వారు పూల వర్షం కురిపించారు.

దక్షిణ, ఉత్తర కేరళలను(తిరువనంతపురం నుంచి కన్నూర్) కలుపుతూ వేగవంతమైన రవాణా రైలు ఆవశ్యకత ఎక్కువగా ఉందని భావించడం వలన ఇతర పార్టీల నేతలు దీనిని వ్యతిరేకించలేకపోయాయి. మరోవైపు కేరళలో కనీసం కొన్ని సీట్లు గెలవడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్న వేళ.. ప్రధాని మోదీ ఇచ్చిన విషు కానుకను ఆమోదం తెలిపి రైలును స్వాగతించలేరు.

సీపీఎం, కాంగ్రెస్‌ నేతలు మౌనం దాల్చారు. అయితే కాషాయ దుస్తులు ధరించిన ఒక కామ్రేడ్ ఎఫ్‌బీ పోస్ట్ ఆశ్చర్యకరంగా ఉంది. వామపక్ష ప్రభుత్వం ప్రతిపాదిత సిల్వర్ లైన్ కంటే వందేభారత్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని వాదించారు. అయితే భూసేకరణ, ఇతర అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ. 1 లక్ష కోట్ల వ్యయం అవుతుందని చెప్పడాన్ని కూడా స్వామీజీ సౌకర్యవంతంగా పట్టించుకోలేదు. మొత్తంగా కేరళకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అక్షరాలా అనేక రాజకీయ ఆశయాలను తుంగలో తొక్కింది.

`స్టీలీ' రిసాల్వ్..
ఉక్కు కడ్డీలను విచ్ఛిన్నం చేయడం లేదా వంచడం ఖచ్చితంగా సులభం కాదు. స్ట్రీట్ మేజిషియన్స్ కొన్నిసార్లు కొంత డబ్బు కోసం అలాంటి విన్యాసాలను ప్రదర్శిస్తారు. అయితే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ చేసిన అలాంటి ప్రయత్నం ఒకటి.. ఆయన రాజకీయ అహాన్ని, బీఆర్‌ఎస్‌ను కూడా కొంత పంక్చర్ చేసింది. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ చర్యను విరమించుకోవాలని కేంద్రంపై తామే ఒత్తిడి చేశామనే క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి కేటీఆర్ హడావిడి చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంో ప్రస్తుతం ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. కేసీఆర్ ఇచ్చిన అల్టిమేటం ఫలితమే ఈ నిర్ణయం అని కేటీఆర్ ప్రగల్భాలు పలికారు.

ప్రభుత్వరంగ సింగరేణి కాలరీస్ కంపెనీ ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ప్రకటన.. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ చర్యను తాత్కాలికంగా నిలిపివేయవచ్చనే కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటనతో సరిపెట్టబడింది. అయితే డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియతో ముందుకు వెళతామని కేంద్రం స్పష్టం చేయడంతో తండ్రీ కొడుకుల ప్రగాల్బాలు కొంత సమయానికి మాత్రమే పరిమితం అయ్యాయి. లైమ్‌లైట్‌ని దొంగిలించడానికి ఎప్పుడూ తొందరపడకండి.

లక్ష్మీపుత్రులు..
బళ్లారిలో తుంగభద్ర జలాశయం నుంచి నీళ్లలాగా డబ్బు ప్రవహిస్తుంది అనేది ఎన్నికల వేళ వినిపించే సామెత. ఈ ఎన్నికల సీజన్‌లో గణినాడు (మైనింగ్‌ భూమి)లో మూడు పార్టీలు బరిలోకి దిగిన సూపర్ రిచ్ అభ్యర్థులు దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేస్తారని అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. వీరంతా ‘‘లక్ష్మీపుత్రులు’’.. ఎన్నికల సమయంలో పర్సు నుంచి డబ్బులను వదులుకోవడంలో పేరుగాంచిన వారు.

ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రెషర్ కుక్కర్లు, ఇతర వస్తువుల రూపంలో ఓటర్లను చేరుకుంటున్నారు. ఈ డ్రామా చివరి అంకం ఓట్లకు నోట్ల సీన్ ఎప్పుడు తెరపైకి వస్తుందని వేచిచూడల్సిందే. ముగింపు సందర్భంగా ఒక్కో ఓటరుకు దాదాపు రూ. 6000 వరకు వస్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంట్లో మద్దతు..
దేశంలోని చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు వారి సిద్ధాంతాలు సమాంతరంగా నడుస్తున్నప్పుడు వారి ఎదిగిన పిల్లల నుండి బహిరంగ తిరుగుబాటును ఎదుర్కొన్నారు. రాజస్థాన్‌లో ఓ ప్రముఖ కేబినెట్ మంత్రి కూడా ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన ఏ ప్రకటన  చేసినా ఆయన  కొడుకు వ్యతిరేకిస్తారు. బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో చాలా శక్తివంతమైన ఆ మంత్రి.. ఇటీవల నిరసనలను శాంతింపజేయడానికి భరత్‌పూర్‌లోని వేరే ప్రదేశంలో బాబా సాహెబ్, మహారాజా సూరజ్‌మల్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే మొదట అనుకున్న స్థలంలోనే విగ్రహాలను ఏర్పాటు చేస్తామని కొడుకు వెంటనే ప్రకటించాడు. ఇప్పుడు కొడుకుపై తండ్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే విగ్రహాల తరలింపుపై మంత్రి తన సొంత కుమారుడిని ఒప్పించడంలో విఫలమవడంతో ఓటర్లు అయోమయంలో పడ్డారు. అసలు ‘‘హోం’’ మంత్రి అయిన తల్లి నుంచి కొడుకు అధికారాన్ని పొందుతున్నాడని కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్