ట్విన్ టవర్స్ కూల్చడానికి డెడ్‌‌లైన్.. గాఢ నిద్రలో మైమరిచి పడుకున్న స్థానికుడు.. చివరకు ఏం జరిగిందంటే?

By Mahesh KFirst Published Aug 28, 2022, 5:09 PM IST
Highlights

ట్విన్ టవర్స్ కూల్చడానికి దాని చుట్టు పరిసరాల్లోని అపార్ట్‌మెంట్ల నుంచి నివాసులు అందరినీ తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం డబుల్ స్టెప్ వెరిఫికేషన్‌లో చాలా పకడ్బందీగా ప్లాన్ వేసుకుని అమలు చేశారు. ఓ వ్యక్తి మైమరచి పోడిపోయాడు.. డెడ్ లైన్ టైం దాటినా బయటకు వెళ్లలేదు. 
 

న్యూఢిల్లీ: ఈ రోజు నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్స్‌ను కూల్చేశారు. నోయిడాలోని సెక్టార్ 93ఏలోని ఈ టవర్స్‌ను ఆధునిక సాంకేతికతతో నేలకూల్చారు. పొరుగునే ఉన్న ఇతర అపార్ట్‌మెంట్లకు ఎంతమాత్రం నష్టం వాటిల్లకుండా కూల్చారు. ఈ టవర్స్ కూల్చడానికి సుమారు 3,500 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఈ కూల్చివేత కోసం టవర్స్ చుట్టుపక్కల నివాసాలను ఖాళీ చేయించారు. అక్కడి నివాసాల్లోని ప్రజలను పక్కా ప్రణాళికలతో తరలించారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్పషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. ఆ రెసిడెన్సీ నివాసులూ బృందాలుగా ఏర్పడి మిగతా అందరికీ అవగాహన కల్పించే పనిలో నిమగ్నం అయ్యారు. సుమారు నెల రోజులుగా వారంతా ఈ పనిలో నిమగ్నం అయ్యారు.

నోయిడా వదిలి వెళ్లేవారు శుక్రవారం కల్లా అక్కడి నుంచి తరలి వెళ్లిపోయారు. కాగా, స్థానికంగానే తాత్కాలిక అకామడేషన్ ఏర్పాటు చేసుకునే వారు కొంచెం నెమ్మదిగా తరలిపోయే పనిలో పడ్డారు. ఇలా ట్విన్ టవర్స్ పరిసరాల్లోని నివాసులు వెళ్లిపోవడానికి లాస్ట్ డెడ్‌లైన్‌గా ఆదివారం ఉదయం 7 గంటలుగా ఉన్నది. ఈ డెడ్ లైన్ ప్రకారం, దాదాపు అందరూ తరలివెళ్లిపోయారు. కానీ, ఒక వ్యక్తి మాత్రం ఈ డెడ్ లైన్ పై ధ్యాసే లేకుండా టాప్ ఫ్లోర్‌లోని తన నివాసంలో హాయిగా నిద్రపోయారు. డెడ్ లైన్ టైమ్ దాటి పోతున్నా ఆ మనిషి మాంచి నిద్రలో ఉన్నాడు.  

తరలింపు ప్రక్రియ దాదాపు ముగిసిందనే అంతా అనుకున్నారు. కానీ, ఓ గ్రూప్‌నకు చెందిన వ్యక్తి ఇంకా బయటకు రాలేదు. దీంతో డెడ్ లైన్ చివరి మినిట్‌లో గాఢ నిద్రలో ఉన్న ఆ మనిషిని సిబ్బంది ఎలాగోలా లేపగలిగారని వివరించారు. సరిగ్గా 7 గంటల ప్రాంతంలో ఆ వ్యక్తి తరలి వచ్చాడు. సెక్యూరిటీ గార్డుల సహకారంతో ఆ వ్యక్తిని లేపగలిగారు. అంతా కలిసి ఎట్టకేలకు ఆ వ్యక్తిని నిద్ర లేపి బయటకు తీసుకువచ్చారు. 

ఈ తరలింపు ప్రక్రియ అంతా కూడా డబుల్ స్టెప్ వెరిఫికేషన్‌లో చేపట్టామని, అందుకే ఆ వ్యక్తి మిస్ అయినట్టు గుర్తించగలిగామని స్పెషల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు నరేశ్ కేశ్వాని తెలిపారు.

click me!