అర్నాబ్ బెయిల్ పొడిగించిన సుప్రీంకోర్టు

Siva Kodati |  
Published : Nov 27, 2020, 02:35 PM IST
అర్నాబ్ బెయిల్ పొడిగించిన సుప్రీంకోర్టు

సారాంశం

ప్రముఖ పాత్రికేయుడు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి మంజూరు చేసిన తాత్కాలిక బెయిలు గడువును సుప్రీంకోర్టు శుక్రవారం మరో నాలుగు వారాలు పొడిగించింది.

ప్రముఖ పాత్రికేయుడు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి మంజూరు చేసిన తాత్కాలిక బెయిలు గడువును సుప్రీంకోర్టు శుక్రవారం మరో నాలుగు వారాలు పొడిగించింది.

ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్లు నమోదైన కేసులో అర్నాబ్ గోస్వామికి సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 11న తాత్కాలిక బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

వారం రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో వున్న అనంతరం అర్నాబ్ బెయిలుపై విడుదలయ్యారు. ఈ బెయిలు మంజూరుకుగల కారణాలను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ ధర్మాసనం శుక్రవారం వివరించింది. 

ఆర్కిటెక్చరల్ సంస్థ అధిపతి ఆత్మహత్య చేసుకునే విధంగా అర్నాబ్ గోస్వామి తదితరులు (అపీలుదారులు) ప్రేరేపించినట్లు చెప్పలేమని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

బాంబే హైకోర్టు ఈ కేసుపై ప్రాథమికంగా విలువకట్టినప్పటికీ, ఎఫ్ఐఆర్, ఐపీసీ 306 మధ్య సంబంధం లేదన్న విషయాన్ని గ్రహించలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అర్నాబ్ గోస్వామిపై ఆరోపణలను మహారాష్ట్ర పోలీసులు నిరూపించలేకపోయారని చెప్పారు. ఎఫ్ఐఆర్‌, ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరానికి ఉండవలసిన అంశాల మధ్య సంబంధం లేదని న్యాయమూర్తి అన్నారు.

బాంబే హైకోర్టు తన అధికారాన్ని వినియోగించడంలో విఫలమైందన్నారు. రాజ్యాంగ విలువలను, ప్రాథమిక హక్కులను కాపాడవలసిన రక్షకురాలిగా తన పాత్రను హైకోర్టు పరిత్యజించిందన్నారు. రాజ్యం తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రాథమికంగా నిరూపించే పౌరులకు ఈ కోర్టు తలుపులు మూసివేయరాదని స్పష్టం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !