ఒక్క ఐడియా వరదల నుంచి వాళ్ల కార్లను కాపాడింది..

By AN TeluguFirst Published Nov 27, 2020, 10:31 AM IST
Highlights

ఒకసారి నష్టపోతాం, రెండు సార్లు నష్టపోతాం.. మూడో సారికి తెలివి తెచ్చుకుంటాం. అదే జరిగింది చెన్నై వాసుల విషయంలో. 2015లో వచ్చిన వరదల్లో చెన్నైలోని వందలాది కార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి. బురదలో కూరుకుపోయాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో వచ్చిన వరదల్లోనూ ఇదే పరిస్థితి. 

నివర్ తుఫాన్ నేపధ్యంలో ఆ పరిస్థితి మళ్లీ రిపీట్ కావద్దనుకున్నారు చెన్నైవాసులు. దీనికోసం ప్రత్యామ్నాయాలు వెతికారు. సింపుల్ ఐడియాతో లక్షల రూపాయలు పోసి కొన్న కార్లను కాపాడుకుంటున్నారు. 

తమిళనాడును అతలాకుతలం చేసిన నివర్ తుపాన్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే, తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమ కార్లు వరద నీటిలో మునిగిపోకుండా చెన్నై వాసులకు ఓ ఐడియా వచ్చింది. రాజధానిలోని వెలాచెరీ ప్రాంతంలో ఉన్న మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్‌ను సురక్షితమైన ప్రదేశంగా గుర్తించారు.

దాంతో కారు యజమానులు ఒకరి తరవాత ఒకరు తమ వాహనాలను అక్కడ పార్క్ చేశారు. దాంతో ఎన్నడూ చూడని విధంగా విలాసవంతమైన, ఖరీదైన కార్లన్నీ ఒక దగ్గర దర్శనమిచ్చాయి. మొత్తానికి ఒకే ఐడియాతో తమ కార్లను కాపాడుకోగలిగారు.

హైదరాబాద్‌లో భారీ వర్షాలకు కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు పడవల్లా మారిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. 

click me!