న్యూ ఇయర్ వేడుకలు.. అమ్మాయిల దుస్తులపై ఆంక్షలు

By ramya neerukondaFirst Published Dec 27, 2018, 12:47 PM IST
Highlights

ఈ వేడుకల్లో పాల్గొనే యువతుల దుస్తులపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. మహిళల భద్రత విషయంలో రాజీపడకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. యువతుల దుస్తుల ఆంక్షలు విధిస్తున్నారు అహ్మదాబాద్ పోలీసులు.

న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకల్లో యువత ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కాగా.. ఈ వేడుకల్లో పాల్గొనే యువతుల దుస్తులపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. మహిళల భద్రత విషయంలో రాజీపడకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. యువతుల దుస్తుల ఆంక్షలు విధిస్తున్నారు అహ్మదాబాద్ పోలీసులు.

న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనే యువతులు పొట్టి దుస్తులు వేసుకోరాదని వడోదర పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యపానం విపరీతంగా తాగి డ్రైవింగ్ చేస్తే.. వారిపై చర్యలు తీసుకుంటామని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రతి సంవత్సరం నూతన వేడుకల పేరుతో డిసెంబర్ 31న విపరీతంగా మద్యం, డ్రగ్స్ సేవించి అసభ్యకరంగా యువత ప్రవర్తిస్తోందని అక్కడి అధికారులు తెలిపారు. అందుకే వాటిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. లౌడ్ స్పీకర్లు వాడరాదని, రాత్రి పదిగంటలు దాటిన తర్వాత బాణా సంచా కాల్చరాదని స్పష్టం చేశారు. 

click me!