2023లో అవిశ్వాస తీర్మానానికి సిద్ధం కావాలని 2019లోనే విపక్షాలకు సూచించిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్..

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ప్రధాని మాట్లాడుతూ.. 2023లో కూడా ప్రతిపక్షాలు ఇలాంటి తీర్మానానికే సిద్ధం కావాలని చెబుతున్నారు.

In 2019, Prime Minister Modi advised the opposition to prepare for the no-confidence motion in 2023.. Video viral..ISR

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మణిపూర్ హింసపై చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మణిపూర్ అంశంపై మాట్లాడే విధంగా కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. అందులో భాగంగానే బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గౌరవ్ గోగోయ్ అవిశ్వాస తీర్మాన నోటీసు  లోక్ సభ స్పీకర్ కు అందించారు. దీనిని ఆయన అంగీకరించారు. 

సుప్రీంకోర్టు కలుగజేసుకునే దాకా మౌనంగా ఉన్న ప్రధానిపై ‘ఇండియా’కు ఎలా నమ్మకం ఉంటుంది - కపిల్ సిబల్

Latest Videos

కాగా.. లోక్ సభలో కేంద్రంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గతంలో పార్లమెంట్ లో చేసిన ప్రసంగం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో 2023లో కూడా ఇదే తరహా కసరత్తుకు (అవిశ్వాస తీర్మానానికి) సిద్ధం కావాలని ప్రధాని మోడీ ప్రతిపక్షాలకు సూచించారు. ఆ వీడియో కేంద్రంలో రెండో సారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంటే, 2019లో పార్లమెంట్ సమావేశాలకు సంబంధించనది.

VIDEO: PM Sh had made a prediction 5 years back about the opposition bringing a No confidence motion! pic.twitter.com/dz8McicQ40

— Dr Jitendra Singh (@DrJitendraSingh)

ఆ సమయంలో టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతుతో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. 2023లో మళ్లీ అవిశ్వాసం పెట్టే అవకాశం వచ్చేలా సన్నద్ధం కావాలని అన్నారు. ఈ సమయంలో ముఖ్యంగా కాంగ్రెస్ ను విమర్శిస్తూ.. ‘‘ఇది సమర్పణ్ భావ్ (సేవ). ఇది (బీజేపీ) ఇద్దరు (ఎంపీలు) నుండి మేము ఇక్కడ (అధికారంలో) కూర్చున్నాము. అహంకారం (అహంకారం) ఫలితమేమిటంటే 400 నుంచి 40కి పడిపోయావు. ఈ రోజు ఎక్కడున్నావో చూడు...’’ అని అన్నారు.

ఎల్ఓసీ దాటేందుకు భారత్ సిద్ధంగా ఉంది.. ఆర్మీకి మద్దతు ఇవ్వడానికి పౌరులు సిద్ధంగా ఉండాలి - రాజ్ నాథ్ సింగ్

ప్రధాని మోడీ ఆ సమయంలో వేసిన ‘అంచనా’ను ఎత్తిచూపుతూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రసంగాన్ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. కాగా.. మరోవైపు మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు ఇవాళ లోక్ సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే సంఖ్యాబలం బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ మణిపూర్ అంశంపై ప్రధాని మాట్లాడాలని ప్రతిపక్షాలు ఒత్తిడి తేవడంలో భాగంగా ఈ చర్యకు ఉపక్రమించాయి. కాగా..  మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఇది రెండో అవిశ్వాస తీర్మానం. 
 

vuukle one pixel image
click me!