
కోవిడ్ -19 (covid-19), డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో ఒకే రోజు 50 వేల కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా 1500 దాటాయి. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ అన్ని దేశాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఈ కొత్త వేరియంట్ చాలా దేశాలకు విస్తరించింది. అయితే ఈ వేరియంట్ స్వల్ప లక్షణాలను, స్వల్ప తీవ్రతను కలిగి ఉన్నా ఇది సోకడం వల్ల ధీర్ఘకాలంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మేకలతో వెల్తున్న లారీ బోల్తా.. పోటీపడి ఎత్తుకుపోయిన గ్రామస్తులు.. ట్రక్కు కింద పడ్డ మనిషి మృతి...
ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు ఇంత పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో థర్డ్ వేవ్ మొదలైందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. ఢిల్లీ, కర్నాటక, చత్తీస్ ఘడ్, పంజాబ్, బీహార్ రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాలు వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటాన్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లు, హాస్పిటల్ బెడ్స్, మెడిసిన్స్ వంటివి సిద్ధం చేసుకున్నాయి.
కరోనా కేసుల్లో ఢిల్లీ, మహారాష్ట్ర లు ముందంజలో ఉన్నాయి. కరోనా కేసులు అధికంగా ఉండటం వల్ల మహారాష్ట్రలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ స్పందించింది. ఇప్పట్లో మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. “ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం లాక్‌డౌన్‌ను విధించాలనే ఆలోచన లేదు. ఒక వేల రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 800 మెట్రిక్ టన్నులు దాటితే లేదా హాస్పిటల్స్‌లో 40 శాతంకు మించి బెడ్స్ నిండిపోతే ఆ తరువాత ప్రభుత్వం లాక్‌డౌన్ లాంటి పరిమితులను పరిశీలిస్తుంది ” అని తెలిపింది.
టీకా తీసుకున్న తర్వాత ప్యారాసెటమల్ వేసుకోవద్దా? భారత్ బయోటెక్ ఏమన్నదంటే..!
కోవిడ్-19 కేసులు ఫిబ్రవరి మధ్యలో తారా స్థాయికి చేరుతుందని తెలిపింది. మార్చి మధ్య నాటికి తగ్గిపోయే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 26,538 కొత్త కేసులు ఎనిమిది మరణాలు నమోదయ్యాయని తెలిపింది. ముంబైలో అత్యధికంగా 15,166 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పింది. దీంతో మహారాష్ట్రలో ఇప్పటివరకు 67,576,032 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,505 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 5,331 కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 65,24,247 కు పెరిగిందని చెప్పింది. ఇప్పటి వరకు కరోనా వల్ల మహారాష్ట్రలో 141,581 మంది మరణించారని తెలిపింది. మరణాల రేటు 2.09 శాతంగా ఉందని చెప్పింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 144 ఓమిక్రాన్ వేరియంట్ కొత్త కేసులు నమోదయ్యాయి, వాటిలో 100 ముంబైలోనే వెలుగు చూశాయి. దీంతో మొత్తంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు 797 కి చేరాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్ నుంచి 330 మంది కోలుకున్నారు.