Framers Protest: వివాదాస్పద వ్యవసాయ చట్టాల నేపథ్యంలో మొదలైన రైతు ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ చట్టాలు రద్దు చేసిన తర్వాత కూడా రైతులు మరో ఆరు ప్రధాన డిమాండ్ల తో ఉద్యమం కొనసాగిస్తున్నారు. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే, రైతులపై కేసులు ఎత్తివేయడానికి కేంద్రం అనుకూలంగా ఉందనీ, కొత్త ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం.
Framers Protest: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల నేపథ్యంలో మొదలైన రైతు ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. పంటకు గిట్టుబాటు ధర, రైతులపై కేసుల ఎత్తివేత, నష్టపరిహారం అందించడం సహా పలు పలు డిమాండ్లతో రైతులు ఉద్యమం సాగిస్తున్నారు. అన్నదాతలు ఉద్యమం విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, మంగళవారం ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేస్తూ రైతులు ఉద్యమం విరమించుకోవాలని సూచింది. ప్రభుత్వం చేసిన పలు ప్రతిపాదనలు తమ డిమాండ్లకు అనుకూలంగా లేవని రైతు సంఘాలు పేర్కొన్నాయి. దీంతో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే, దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా ఆందోళన సాగిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని విరమించేలా కేంద్ర ప్రభుత్వం మరో ఆఫర్ ఇచ్చింది. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన పోలీసు కేసులను తక్షణమే ఎత్తేస్తామని తెలిపింది. ఈ మేరకు బుధవారం నాడు రైతు సంఘాలకు మరో ప్రతిపాదన పంపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు అయితే రైతు సంఘాలు స్పందించలేదు.
Also Read: Priyanka Gandhi : ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్..
undefined
ఇదిలావుండగా, అన్నదాతల డిమాండ్ల నేపథ్యంలో రైతు సంఘాలకు మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు పంపింది. పండించిన పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చట్టబద్ధతపై కమిటీని ఏర్పాటు చేస్తామని అందులో పేర్కొంది. ఈ కమిటీలో రైతు సంఘాల నేతలు కూడా ఉంటారని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. దీంతో పాటు రైతులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకుంటామని ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఓ షరతు విధించింది. ప్రతిపాదనల అమలుకు ముందు అన్నదాతలు తమ ఉద్యమాన్ని విరమించుకోవాలని పేర్కొంది. వెంటనే ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసి రైతులు ఇండ్లకు వెళ్లాలని తెలిపింది. దీనిపై రైతు సంఘాల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రైతు సంఘాల మరోసారి భేటి కానున్నాయని సంయుక్త్ కిసాన్ మోర్చ (Samyukt Kisan Morcha) నాయకులు తెలిపారు.
Also Read: Sonia Gandhi : కేంద్రపై నిప్పులు చెరిగిన సోనియా.. రైతు మద్దతుకు కట్టుబడి ఉన్నాం..
దీనికి అనుగుణంగానే రైతు సంఘాలు సమావేశమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఆఫర్‌లో కొన్ని లోపాలున్నాయని రైతు సంఘాలు పేర్కొన్నాయి. రైతు ఉద్యమాన్ని విరమించుకున్న తర్వాతనే రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం ఆమోదయోగ్యం కాదని Samyukt Kisan Morcha కమిటీ తీర్మానిస్తూ.. ప్రభుత్వ ప్రతిపాదలను వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలోనే బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇదివరకు రైతులకు పంపిన ప్రతిపాదనలను సమరించి.. తిరిగి రైతులకు పంపినట్టు సమాచారం. కొత్త ప్రతిపాదనపై రైతు సంఘాల Samyukt Kisan Morcha కమిటీ మరోసారి సమావేశం కానుంది. ప్రస్తుతం రైతు సంఘాల సమావేశం కొనసాగుతున్నది. ఈ సమావేశం ముగిసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. అలాగే, రైతు ఉద్యమం కొనసాగించనున్నారా? లేదా ముగించనున్నారా? అనేది కూడా తేలియనుంది.
Also Read: Vizag steel plant protest : విశాఖ ఉక్కు ఉద్యమానికి 300 రోజులు.. నేడు భారీ ధర్నా