అక్రమ సంబంధం... కోడలిని దారుణంగా చంపిన మామ

Arun Kumar P   | Asianet News
Published : Feb 18, 2020, 12:15 PM IST
అక్రమ సంబంధం... కోడలిని దారుణంగా చంపిన మామ

సారాంశం

తన కోడలికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం వుందన్న అనుమానంతో ఓ మామ దారుణానికి ఒడిగట్టిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

చెన్నై: కుటుంబ పరువును తీస్తుందన్న కోపంతో కోడలిని అత్యంత దారుణంగా హతమార్చాడో మామ. తన కొడుకు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని నెరుపుతున్నందునే తన కోడలిని చంపినట్లు తెలిపాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. 

సేలం జిల్లా తంబంపట్టిలో అరివళగన్, ఆముద దంపతులు నివసిస్తున్నారు. అరిగళవన్ ఓ ప్రైవేట్ సంస్థలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. దీంతో అతడు ఇంట్లోంచి ఉదయం బయటపడి ఎప్పుడో రాత్రికి చేరుకునేవాడు. దీంతో ఆ సమయంలో ఆముద వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని నడిపేదని అరివళగన్ తండ్రి పళని(63) ఆరోపించాడు.R

read more  లవ్ అఫైర్: యువతి ప్రైవేట్ పార్ట్స్ పై తుపాకీతో కాల్పులు, మృతి 

ఇలా తన కోడలి అక్రమసంబంధం కారణంగా కుటుంబ పరువు బజారున పడుతోందని భావించాడు. దీంతో ఎలాగయినా ఆమెను హతమార్చాలన్న దారుణ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ క్రమంలోనే కొడుకు అరివళగన్ ఇంట్లోంచి బయటికివెళ్లగానే ఒంటరిగా వున్న కోడలిని దారుణంగా హతమార్చాడు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తానే హత్య చేసినట్లు అంగీకరించడంలో పళనిని అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్