మలేరియాకు తొలి టీకా వచ్చేసింది.. ఆమోదించిన డబ్ల్యూహెచ్‌వో

By telugu teamFirst Published Oct 7, 2021, 1:31 PM IST
Highlights

మలేరియాకు తొలి టీకా వచ్చేసింది. మాస్క్విరిక్స్ టీకాను మలేరియా నివారణకు విస్తృతంగా వినియోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది. 2019 నుంచి మూడు ఆఫ్రికా దేశాల్లో చేపడుతున్న పైలట్ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన తర్వాత డబ్ల్యూహెచ్‌వో ఆమోదముద్ర వేసింది.

న్యూఢిల్లీ: ప్రతి యేటా సుమారు నాలుగు లక్షల చిన్నారులను పొట్టనబెట్టుకుంటున్న మలేరియా వ్యాధికి టీకా వచ్చేసింది. malariaకు తొలి vaccine వచ్చింది. ఆర్‌టీఎస్,ఎస్/ఏఎస్01(ట్రేడ్ నేమ్.. మాస్క్విరిక్స్)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. ఈ టీకాను విస్తృతంగా వినియోగించాలని తెలిపింది. ఘనా, కెన్యా, మాలావీ దేశాల్లో 2019లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ఫలితాలను సమీక్షించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 

ఈ టీకాను జీఎస్కే 1987లో తొలిసారిగా తయారు చేసింది. దీన్ని 2019 నుంచి దీనిపై పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో భాగంగా సుమారు 20 లక్షల మంది పిల్లలకు టీకా వేశారు. చాలా మేరకు ఈ టీకా మలేరియాను నిలువరించగలిగినట్టు ఫలితాలు వచ్చాయి. ఈ ఆధారలను పరిశీలించిన తర్వాత మలేరియా తొలి వ్యాక్సిన్‌ను విస్తృతంగా వినియోగించాలని రికమెండ్ చేసినట్టు WHO డైరెక్టర్ టెడ్రోస అధనామ్ వెల్లడించారు.

సంపూర్ణ క్లినికల్ డెవలప్‌మెంట్ పూర్తి చేసుకున్న మాస్క్విరిక్స్ తొలి యాంటీ మలేరియా వ్యాక్సిన్. యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ కూడా ఈ టీకాకు సానుకూల శాస్త్రీయ అభిప్రాయాలు వెల్లడించింది.

click me!