ఐఐటీ మద్రాస్ లో ఆంధ్ర విద్యార్థి ఆత్మహత్య.. నెల రోజుల్లో రెండో ఘటన

Published : Mar 14, 2023, 10:57 PM IST
ఐఐటీ మద్రాస్ లో ఆంధ్ర విద్యార్థి ఆత్మహత్య.. నెల రోజుల్లో రెండో ఘటన

సారాంశం

ఐఐటీ-మద్రాస్‌లో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పుష్పక్ అనే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన 20 ఏళ్ల విద్యార్థిగా గుర్తించారు.      

ఐఐటీ మద్రాస్ విద్యార్థి ఆత్మహత్య: ఐఐటీ విద్యార్థులు క్రమంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌లో మంగళవారం (మార్చి 14) మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ చెందిన విద్యార్థి పుష్పక్‌(20) అనే B.Tech మూడవ సంవత్సరం విద్యార్థి మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. గత నెలలో కూడా ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే.. వారిలో ఒకరు మరణించారు.

గత నెల 14వ తేదీన ఐఐటీ మద్రాస్‌లో రెండు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. వీరిలో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మరో విద్యార్థి విష మాత్రలు తాగాడు. మాత్రలు వేసుకున్న మరో విద్యార్థిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. 

ఐఐటీ మద్రాస్‌ ప్రకటనలో ఏముంది?

నేడు IIT మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన మూడవ సంవత్సరం BTech విద్యార్థి అకాల మరణం తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. కోవిడ్ అనంతర వాతావరణం సవాలుతో కూడుకున్నదని, క్యాంపస్‌లోని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది యొక్క శ్రేయస్సును మెరుగుపరచడానికి కృషిచేశామని,అలాగే.. వివిధ సహాయక వ్యవస్థలను నిరంతరం మూల్యాంకనం చేస్తున్నామని ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

ఇటీవల ఎన్నుకోబడిన విద్యార్థి ప్రతినిధులతో సహా స్టాండింగ్ ఇన్‌స్టిట్యూట్ అంతర్గత విచారణ కమిటీ అటువంటి సంఘటనలను పరిశీలిస్తుంది. విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించబడింది.ఈ దురదృష్టకర సమయంలో కుటుంబం యొక్క గోప్యతను గౌరవించాలని మేము ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నామని, ఇన్స్టిట్యూట్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుందని ప్రకటన పేర్కొంది.

గత నెలలో ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి వేరే మాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో ఉరివేసుకుని మృతి చెందిన విద్యార్థి మహారాష్ట్ర వాసి. అతడిని 27 ఏళ్ల స్టీఫెన్ సన్నీగా గుర్తించారు.

మరోవైపు, ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడిన రెండో విద్యార్థిని కర్ణాటకకు చెందిన బి వివేక్‌గా గుర్తించారు. ఈ ఇద్దరి విద్యార్థులను తలుపులు పగులగొట్టి బయటకు తీశారని పోలీసులు తెలిపారు. స్టీఫెన్ తన గదిలోకి ఉరివేసుకుని చనిపోయాడు. ఈ సమయంలో కొందరు స్నేహితులు అతని గది తలుపు తట్టగా లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. హాస్టల్ వార్డెన్‌కు ఈ సమాచారం అందించారు. తన గది తలుపులు పగలగొట్టి చూడగా స్టీఫెన్ ఉరివేసుకుని కనిపించాడు. అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. 

అదే సమయంలో మరో విద్యార్థి వివేక్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు కొన్ని రోజులు క్లాసుకు కూడా హాజరుకాలేదు. దీంతో అతని స్నేహితులు వివేక్‌ను కలవడానికి అతని రూం కు వచ్చారు. గది తలుపులు మూసి ఉండడం చూసి తట్టారు, కానీ సమాధానం రాలేదు. ఫోన్ కాల్స్‌కు కూడా సమాధానం ఇవ్వడం లేదు. ఇనిస్టిట్యూట్‌లోని అధికారులు తలుపులు పగులగొట్టి తెరిచి చూడగా, అతను గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. సరైన సమయంలో ఆస్ప్రతికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !