
భారత్‌తో గత కొద్ది రోజులుగా రోజువారి కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో కోవిడ్ మూడో దశ (third wave of Covid-19) క్షీణించింది. అయితే కరోనా నాలుగో దశ జూన్ 22 నాటికి ప్రారంభమవుతుందని తాజా పరిశోధనలు అంచనా వేస్తున్నాయి. నాలుగో వేవ్.. నాలుగు నెలల పాటు కొనసాగనుందని ఐఐటీ కాన్పూర్ ( IIT Kanpur) పరిశోధకులు అంచనా వేశారు. అయితే నాలుగో వేవ్ (fourth wave) తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల ఆవిర్బావం, బూస్టర్ డోస్ పంపిణీ, ప్రజల వ్యాక్సినేషన్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. అక్టోబర్ 24 వరకు కోవిడ్ నాలుగో వేవ్ కనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ స్టాటిస్టికల్ ప్రిడిక్షన్ ఫిబ్రవరి 24న ప్రీప్రింట్ సర్వర్ MedRxivలో ప్రచురించబడింది.
నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని పరిశోధకులు అంచనా వేశారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయని తెలిపారు. దేశంలో కోవిడ్ వేవ్‌లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్ అంచాల విషయంలో కొద్ది రోజుల తేడాతో దాదాపు కచ్చితమైన అంచనా వేశారు.
ఐఐటీ కాన్పూర్‌ని గణితం, గణాంకాల విభాగానికి చెందిన సబర పర్షద్ రాజేష్‌భాయ్, సుభ్ర శంకర్ ధర్ మరియు శలభ్ ఈ పరిశోధనను నిర్వహించారు. 2020 జనవరి 30 దేశంలో అధికారికంగా అధికారికంగా నమోదైన తేదీ నుండి 936 రోజుల తర్వాత భారతదేశంలో నాల్గవ వేవ్ రావచ్చని ఈ బృందం తెలిపింది. ‘నాలుగో వేవ్ జూన్ 22 నుండి ప్రారంభమవుతుంది. ఆగస్టు 23న గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అక్టోబర్ 24 న ముగుస్తుంది’ వారు చెప్పారు.
"చాలా దేశాలు ఇప్పటికే థర్డ్ వేవ్‌ను చూశాయి. కొన్ని దేశాలు మహమ్మారి నాలుగో వేవ్ ఎదుర్కోవడం ప్రారంభించాయి. జింబాబ్వే డేటా ఆధారంగా గాస్సియన్ డిస్ట్రిబ్యూషన్ మిశ్రమం యొక్క భావనను ఉపయోగించి భారత్‌లో థర్డ్ వేవ్ అంచనా వేయబడింది. భారతదేశంలో మూడవ వేవ్ పూర్తవుతున్నప్పుడు.. ఈ సూచన దాదాపు సరైనదని స్పష్టమైంది. ఆ అధ్యయనం ద్వారా ప్రేరేపించబడిన మేము నాలుగో వేవ్ అంచనాను పరిశోధించాం’ అని పరిశోధకులు తెలిపారు.