UP Election 2022 : యూపీలో నేడు ఐదో ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌లు.. 12 జిల్లాలోని 61 స్థానాల‌కు పోలింగ్

Published : Feb 27, 2022, 06:14 AM IST
UP Election 2022 : యూపీలో నేడు ఐదో ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌లు.. 12 జిల్లాలోని 61 స్థానాల‌కు పోలింగ్

సారాంశం

దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ లో ఆదివారం ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. 

UP Election News 2022 : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు ముగిశాయి. ఆదివారం నాడు ఐదో ద‌శ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. నేడు ఎన్నిక‌లు ముగిసిపోతే మ‌రో రెండు ద‌శ‌ల ఎన్నిక‌లు మాత్ర‌మే మిగిలి ఉంటాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను మార్చి 10వ తేదీన వెల్ల‌డించ‌నున్నారు. 

యూపీలో నేడు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభ‌మవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ముగుస్తుంది. మొత్తంగా ఉత్తరప్రదేశ్‌లోని 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వ‌హిస్తున్న ఈ ఐదో ద‌శ పోలింగ్ లో 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 2.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నేడు అమేథీ (Amethi), రాయ్‌బరేలీ(Raebareli), అయోధ్య (Ayodhya), సుల్తాన్‌పూర్ (Sultanpur), చిత్రకూట్ (Chitrakoot), ప్రతాప్‌గఢ్ (Pratapgarh), కౌశాంబి (Kaushambi), ప్రయాగ్‌రాజ్(Prayagraj), బారాబంకి (Barabanki), బహ్రైచ్ (Bahraich), శ్రావస్తి (Shravasti), గోండా (Gonda)లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

కౌశాంబి జిల్లాలోని సిరతు అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ నాయ‌కుడు, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ (keshav prasad) పోటీలో ఉన్నారు. ఆయ‌న‌తో అప్నా దళ్ (కామెరవాడి) అభ్యర్థి పల్లవి పటేల్‌ తలపడుతున్నారు. అలాగే అలహాబాద్ వెస్ట్ నుంచి సిద్ధార్థ్ నాథ్ సింగ్, పట్టి (ప్రతాప్‌గఢ్) నుంచి రాజేంద్ర సింగ్ అలియాస్ మోతీ సింగ్, అలహాబాద్ సౌత్ నుంచి నంద్ గోపాల్ గుప్తా నాడి, మాన్కాపూర్ (గోండా) నుంచి రమాపతి శాస్త్రి పోటీలో ఉన్నారు.

1993 నుంచి కుంట నుండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురాజ్ ప్రతాప్ సింగ్, అలియాస్ రాజా భయ్యా, ఆయ‌న పార్టీ జనసత్తా దళ్ నుండి మరోసారి పోటీలో ఉన్నారు. ఆయ‌న‌పై సమాజ్ వాదీ పార్టీ నుంచి గుల్షన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తల్లి, అప్నాదళ్ (కె) నాయకుడు కృష్ణ పటేల్ ప్రతాప్‌గఢ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అప్నాదళ్ (కె) సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కాగా ఆదివారం ఐదో పోలింగ్ పూర్త‌యితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 403 స్థానాల్లోని 292 స్థానాలకు ఓటింగ్ ఓటింగ్ పూర్త‌యిన‌ట్టు అవుతుంది. చివ‌రి రెండు ద‌శ‌ల ఎన్నిక‌లు మార్చి 3, 7 తేదీల్లో జరగనున్నాయి.

2017లో యూపీలో జ‌రిగిన ఎన్నిక‌లో బీజేపీ (bjp) అత్య‌ధిక స్థానాలు గెలుపొంది అధికారం ఏర్పాటు చేసింది. సీఎంగా యోగి ఆదిత్య‌నాథ్ (yogi adityanath) బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అంత‌కు ముందు అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ (samajwadi party) అధికారంలో ఉంది. అయితే 2017 ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ (congress)తో క‌లిసి పోటీ చేసింది. కానీ ఈ సారి కాంగ్రెస్ కు దూరంగా ఉంది. అయితే ఆర్ఎల్ డీ (RLD), అప్పాద‌ళ్ (Apnadhal)తో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్, బీజేపీలు ఒంట‌రిగానే పోటీ చేస్తున్నాయి. ఈ సారి కాంగ్రెస్ కూడా మొద‌టి నుంచి ప్ర‌చారం గ‌ట్టిగానే నిర్వ‌హించింది. అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), మాయావ‌తి (mayavathi) నేతృత్వంలోని బీఎస్పీ (bsp) కూడా పోటీలో ఉన్నాయి. మ‌రి ఈ సారి ఎవ‌రిని ఓట‌ర్లు ఆశీర్విదిస్తారో.. ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో తెలియాలంటే మార్చి 10 వ‌ర‌కు ఎదురు చూడాల్సి ఉంటుంది. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌