ఈ పండ్లు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి పారేస్తాం... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్

Published : Aug 25, 2026, 10:21 AM IST
If these fruits are sold we will cancel the license and throw them away  Strong warning to Amazon and Flipkart

సారాంశం

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ సైట్లలో విషపూరితమైన దత్తూర పండ్లను, గింజలను అమ్మకానికి ఉన్నాయి. ఈ పండ్లను ఉమ్మెత్త పండు అంటారు. వాటిని అమ్మొద్దని ఆహార భద్రత, ఔషధ నియంత్రణ శాఖ నోటీసులు ఇచ్చింది. వీటిని అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నో వస్తువులు అమ్మకానికి ఉంటాయి. లేని వస్తువులంటూ అందులో ఉండవు. అయితే వీటిలో విషపూరితమైన దత్తూరి పండ్లు, వాటి గింజలను కూడా అమ్మకానికి ఉన్నాయి. దత్తూరి పండ్లు అంటే ఉమ్మెత కాయలు లేదా పండ్లు అని పిలుచుకోవచ్చు. అయితే వీటిని అమ్మొద్దని ఆహార భద్రత, ఔషధ నియంత్రణ శాఖ నోటీసులు ఆ ఫ్లాట్ ఫామ్‌లకు జారీ చేసింది.

దత్తూరి లేదా ఉమ్మెత్త పండ్లు చాలా విషపూరితమైనవి, మనుషుల ఆరోగ్యానికి తీవ్ర హానికరమైనవి. ఇలాంటి పండ్లను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ-కామర్స్ సంస్థలకు అధికారులు ఈ ఆదేశాలు ఇచ్చారు. నిబంధనలు మీరితే ఫుడ్ లైసెన్స్ రద్దు చేస్తామని గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం.

అంత విషపూరితమా?

ఈ దత్తూరి మొక్కలు లేదా ఉమ్మెత్త మొక్కలు మన చుట్టూ పక్కల ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. దీని పువ్వులు తెల్లగా అందంగా ఉన్నా, వాసన మాత్రం చాలా చెడుగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు, కాయలు తగిలినా ఆ వాసన మన శరీరానికి పట్టేస్తుంది. ఇంతటి విషపూరితమైన ఈ పండు, గింజలను ఈ మధ్య ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. పొరపాటున తింటే మనిషి చనిపోయేంత ప్రమాదం ఉంది. అందుకే, ఎలాంటి అనుమతి లేకుండా వీటిని అమ్మడంపై ఆహార భద్రత శాఖ నిషేధం విధించింది. ప్రజలు కూడా ఇలాంటి ప్రమాదకరమైన పండ్లను, గింజలను ఆన్‌లైన్‌లో కొనవద్దని, తినవద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఈ కాయలను పొరపాటున తిన్నా లేదా లోపలికి తీసుకున్నా పిచ్చిపట్టినట్టు అవ్వడం, మతిభ్రమించడం, గుండె వేగం పెరగడం, కోమాలోకి వెళ్లడం, చివరకు మరణం సంభవించడం జరుగుతుంది. పిల్లలు, పెంపుడు జంతువులను ఈ మొక్కకు దూరంగా ఉంచాలి. లేకుంటే త్వరగా అనారోగ్యం బారిన పడుతారు,

అయితే పరమశివునికి మాత్రం ఈ ఉమ్మెత్త పువ్వులు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా చెప్పుకుంటారు. మహాశివరాత్రి, శ్రావణ మాస పూజల్లో వీటిని శివునికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల శివుడు ప్రసన్నమవుతాడని అంటారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heavy Rain Alert : జలదిగ్భందంలో రాజధాని నగరం.. విమానాలే రద్దయ్యే స్థాయిలో కుండపోత వర్షం
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?