‘‘క్యాథలిక్‌లు లేకపోతే తమిళనాడు బీహార్‌గా మారేది’’ - అసెంబ్లీ స్పీకర్.. దుమారం రేపుతున్న ఆయ‌న వ్యాఖ్యలు

Published : Jul 26, 2022, 12:10 PM IST
‘‘క్యాథలిక్‌లు లేకపోతే తమిళనాడు బీహార్‌గా మారేది’’ - అసెంబ్లీ స్పీకర్.. దుమారం రేపుతున్న ఆయ‌న వ్యాఖ్యలు

సారాంశం

నెల రోజుల కిందట తమిళనాడు స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన రాష్ట్ర అభివృద్ధికి క్యాథలిక్ క్రైస్తవులే కారణం అని అన్నారు. లేకపోతే తమిళనాడు వేరేలే ఉండేదని ఆయన చెప్పారు. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. 

రాష్ట్ర అభివృద్ధికి క్రిస్టియన్ మిషనరీలు కారణమని, కాథలిక్ మిషన్లు చేయకపోతే రాష్ట్రం మరో బీహార్‌గా మారేదని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం.అప్పావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రాజ‌కీయ దుమార‌న్నే రేపుతున్నాయి. ఆయ‌న ఈ వ్యాఖ్య‌ల గ‌త నెల‌లో చేశారు. కానీ తాజాగా దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఈ విష‌యంలో డీఎంకేపై బీజేపీ విరుచుకుప‌డింది. సెక్యుల‌ర్ పార్టీగా చెప్పుకునే డీఎంకే ఇప్పుడు హిందూ వ్య‌తిరేక భావ‌జాలంతో ప‌ని చేస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంద‌ని ఆరోపించింది. 

షాకింగ్.. పదహారేళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. మూడునెలలుగా సామూహిక అత్యాచారం..

గ‌త నెల 28వ తేదీన డీఎంకే ఎమ్మెల్యే, రాష్ట్ర శాస‌న స‌భ స్పీక‌ర్ అయిన అప్పావు ఇనిగో ఇరుదయరాజ్ తిరుచిరాపల్లిలోని సెయింట్ పాల్ సెమినరీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  “ ఈ ప్రభుత్వాన్ని మీరందరూ సృష్టించారని ముఖ్యమంత్రి (ఎంకే స్టాలిన్)కి తెలుసు. మీరు (క్యాథలిక్ మిషన్లు) ముందుకు వెళ్లి మీ సీఎంతో మాట్లాడండి. నేను మీకు స‌పోర్ట్ చేస్తాను. మిమ్మల్ని తొలగిస్తే తమిళంలో ఎటువంటి అభివృద్ధి ఉండదు. నాడు.. మిషనరీలు లేకుంటే తమిళనాడు బీహార్ లాగా ఉండేది’’ అని స్పీకర్ అప్పావు అన్నారు.

‘‘ ఈ రోజు నేను ఈ స్థాయికి ఎదగడానికి క్యాథలిక్ ఫాదర్లు. సిస్టర్స్ మాత్రమే సహకరించారు. తమిళనాడు ప్రభుత్వం మీ ప్రభుత్వం. మీరు. ఈ ప్రభుత్వాన్ని సృష్టించారు. మీ ప్రార్థనలు, ఉపవాసాలే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సామాజిక న్యాయం, ద్రావిడ నమూనా ప్రభుత్వానికి కాథలిక్ క్రైస్తవులు, క్రైస్తవ ఫాదర్లు ప్రధాన కారణం. ’’ అని అన్నారు. ఆయ‌న ఇంకా మాట్లాడుతూ.. ‘‘ మీరు (క్యాథలిక్ క్రైస్తవులు) ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ సమస్యలన్నింటినీ లిస్ట్ చేసి నేరుగా సీఎంకు ఇవ్వండి. ఆయన దేన్నీ కాదనరు. అన్నీసర్దుతారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు కావ‌డానికి మీరే కారణం అని సీఎంకు తెలుసు. తమిళనాడు నుంచి క్రైస్తవులను తరిమేస్తే అభివృద్ధి ఉండదు. తమిళనాడు అభివృద్ధికి ప్రధాన కారణం కాథలిక్ క్రైస్తవులే. నేటి తమిళనాడు మీతో నిర్మాణమైంది’’ అని ఆయన అన్నారు. 

దంతేవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. రూ. 5 లక్షల రివార్డు ఉన్న మావోయిస్ట్ నేత హతం..

కాగా ఆయ‌న నెల రోజుల కింద‌ట చేసిన అప్పావు చేసిన ప్రసంగం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అంశంపై బీజేపీ డీఎంకేపై దాడి చేసింది. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ తీరును ఖండించింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి నారాయణన్ సోషల్ మీడియా ద్వారా అప్పావు ప్రసంగానికి చురకలంటించారు. ‘‘ డీఎంకే సెక్యులరిజం అంటే ఇదేనా.. తమను తాము సెక్యులర్ పార్టీగా చెప్పుకునే హక్కును కోల్పోయారు. ఇప్పుడు డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అని ఇది రుజువు చేస్తోంది. ’’ అని అన్నారు.

Kargil Vijay Diwas 2022 : గత యూపీఏ ప్రభుత్వం కార్గిల్ వీరుల త్యాగాన్ని గుర్తించలేదు.. రాజీవ్ చంద్రశేఖర్..

మరోవైపు ఈ అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని అప్పావు విమర్శించారు. ‘‘ నా ప్రసంగాన్ని బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇది మంచి విషయమే. నేను అలా అనలేదని చెప్పను. అవును అలా చెప్పాను. కానీ సోషల్ మీడియాలో నేను మాట్లాడిన వ్యాఖ్యలను ట్రిమ్ చేశారు. అవే ప్రచారం అవుతున్నాయి. నేను ఏది మాట్లాడినా అది చరిత్ర మాత్రమే. దీనిని రాజకీయాలు చేయవద్దు ’’ అని అప్పావు వార్తా సంస్థ ANIతో అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్