మణిపూర్ లో శాంతి నెలకొంటే.. జీ20 సదస్సు అక్కడెందుకు నిర్వహిండం లేదు - కేంద్రానికి అఖిలేష్ యాదవ్ సూటి ప్రశ్న

By Asianet NewsFirst Published Aug 19, 2023, 4:41 PM IST
Highlights

మణిపూర్ లో సాధారణ పరిస్థితితులు నెలకొన్నాయని బీజేపీ చెబుతోందని, అలాంటప్పుడు ఆ రాష్ట్రంలో జీ20 సదస్సు నిర్వహించాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నేడు భారత్ లో బీజేపీయే అతి పెద్ద పరివాద్వార్ పార్టీ అని అన్నారు.

మణిపూర్ లో శాంతి భద్రతలు సాధారణ స్థితికి వస్తే ఎందుకు అక్కడ జీ 20 సదస్సు నిర్వహించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. శనివారం ఆయన ‘ఆజ్ తక్’ నిర్వహించిన ‘జీ 20 కా చునావ్ కనెక్షన్’ సెషన్ లో మాట్లాడారు. మణిపూర్ లో జీ20 సదస్సులు జరగకపోవడంపై ఆయన ప్రశ్నలు కురిపించారు. ‘‘ఉత్తర ప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాలలో అనేక జీ 20 కార్యక్రమాలు జరిగాయి. కానీ మణిపూర్ లో ఎందుకు నిర్వహించలేదు?’’ అని ఆయన అన్నారు.

‘‘ఈ కార్యక్రమాలను బీజేపీ సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఆ పార్టీ స్పాన్సర్ చేయాలి. ప్రభుత్వం ఎందుకు స్పాన్సర్ చేస్తోంది. పన్ను చెల్లింపుదారులు ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారు? మణిపూర్ లో పరిస్థితి బాగానే ఉందని ప్రభుత్వం చెబుతోందని, అప్పుడు వారు మణిపూర్ లో జీ 20 కార్యక్రమాన్ని నిర్వహించాలి’’ అని ఆయన అన్నారు.

ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమాలతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ మణిపూర్ ప్రస్తుతం పెద్ద సమస్య అని అఖిలేష్ యాదవ్ అన్నారు. దేశంలో ఒక రాష్ట్రం బాగానే ఉందని మీరు (కేంద్రం) చెబుతుంటే అక్కడ జీ20 ఈవెంట్ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. మణిపూర్ లో జీ20 సదస్సు నిర్వహించి పరిస్థితి బాగుందని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. 

ప్రతిపక్షాల కూటమిని ‘ఘమాండియా’(అహంకారానికి ప్రతీక)గా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. ‘‘జో ఇండియా కో గమాండియా కహే, హు ఖుద్ గమాండియా హై (ఇండియాను గమాండియా అని పిలిచేవారే అహంకారపరులు) అంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై చేసిన అవినీతి, పరివార్వాద్ (వారసత్వ రాజకీయాలు), అవినీతి ఆరోపణలపై కూడా అఖిలేశ్ యాదవ్ స్పదించారు. ‘‘జ్యోతిరాదిత్య సింధియా వారసత్వ రాజకీయాల్లో భాగం కాదా? నేను పుట్టిన రాష్ట్రం నుంచి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ పరివార్వాద్ కారణంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. నేను రెండు పేర్లు మాత్రమే చెప్పాను. కానీ ఒక పెద్ద జాబితానే ఉంది’’ అని అన్నారు.

‘‘ఎంపీలు ఎన్నికవుతారు. నామినేట్ కారు. మేము అభ్యర్థులకు టిక్కెట్లు మాత్రమే ఇవ్వవచ్చు. కానీ వారు ప్రజల చేత ఎన్నుకోబడతారు’’ అని అన్నారు. బీజేపీ తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదన్నారు. నేడు భారతదేశంలో అతిపెద్ద పరివార్వాద్ పార్టీ బీజేపీయే అని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. 

click me!