ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతుల్లో ఒకరు ప్రధాని నరేంద్ర మోడీకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఒక సారి పంజాబ్ కు వచ్చి తిరిగి వెళ్లారని, కానీ మళ్లీ ఇప్పుడు మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
‘ఢిల్లీ చలో’ పిలుపులో భాగంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ నిరసనల్లో ఓ రైతు ప్రధాని నరేంద్ర మోడీని బహిరంగంగా హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి, వివాదానికి దారి తీసింది. మరోసారి పంజాబ్ లో కాలుమోపే సాహసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ వీడియోలో రైతు ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తున్నాడు.
మోడీ గతసారి పంజాబ్ నుంచి పారిపోయారని, ఈసారి వస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ రైతు హెచ్చరించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో వివాదంగా మారింది. ఇలాంటి హెచ్చరికలు దేశంలో అశాంతికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి.
An alleged farmer, part of so-called openly threatens Prime Minister of India with dire consequences if he visits Punjab next time.
"Modi escaped from Punjab last time, if he comes to Punjab this time then he will not be saved"pic.twitter.com/p32HFckOh7
undefined
కాగా.. రైతులు దేశ రాజధానిలోకి అడుగుపెట్టకుండా, కవాతు చేయకుండా చూసేందుకు పోలీసులు బుధవారం కూడా పటిష్ఠ బందోబస్తు కొనసాగిస్తున్నారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించి, సెంట్రల్ ఢిల్లీ, హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద వ్యూహాత్మకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సింఘు (ఢిల్లీ-సోనిపట్), టిక్రీ సరిహద్దులు (ఢిల్లీ-బహదూర్గఢ్) వద్ద రాకపోకలను నిలిపివేశారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించడానికి నిఘా కోసం డ్రోన్లను ఉపయోగించి అల్లర్ల నిరోధక గేర్లో ఉన్న భద్రతా దళాలను మోహరించారు.
సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దులను పలు పొరల బారికేడ్లు, కాంక్రీట్ బ్లాక్స్, ఇనుప గోర్లు, కంటైనర్ గోడలతో పటిష్టం చేశారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలను ఎత్తిచూపుతూ అవసరమైతే సరిహద్దు పాయింట్ల వద్ద, సెంట్రల్ ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసే అవకాశం కనిపిస్తోంది.
అయితే మూడు సరిహద్దు పాయింట్ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం వల్ల ఈ నిరసనకు సంబంధం లేని సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు కనీస మద్దతు ధరలపై చట్టం, రుణ మాఫీ వంటి తమ డిమాండ్ల పరిష్కారం కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా "ఢిల్లీ చలో" ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే..
మంగళవారం, పంజాబ్ రైతులు ఢిల్లీకి వెళ్లకుండా నిరోధించడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడంతో హర్యానా, పంజాబ్ మధ్య రెండు సరిహద్దు పాయింట్ల వద్ద డ్రోన్ ద్వారా జారిన బాష్పవాయు గోళాలను ఎదుర్కొన్నారు. అర్థరాత్రి వరకు వారిని పంజాబ్-హర్యానా సరిహద్దులో హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. సరిహద్దులు, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విస్తృతమైన బారికేడ్లు ఉండటంతో మంగళవారం ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మందకొడిగా సాగింది.
సెంట్రల్ ఢిల్లీలోని తొమ్మిది మెట్రో స్టేషన్ల గేట్లను సాయంత్రం వరకు మూసివేయడంతో మెట్రో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రముఖ చారిత్రక ప్రదేశం ఎర్రకోట సముదాయాన్ని కూడా మంగళవారం సందర్శకులకు ప్రవేశం కల్పించకుండా తాత్కాలికంగా మూసివేశారు. ఈ నిసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 144 కింద నెల రోజుల పాటు నిషేధాజ్ఞలు అమలు చేశారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం, ఊరేగింపులు, ర్యాలీలు, ప్రజలను తీసుకెళ్లే ట్రాక్టర్ ట్రాలీల ప్రవేశంపై ఈ ఆదేశాలు నిషేధం విధించాయి.