ఎమ్మెల్యేగా గెలిపిస్తే... ప్రతి ఒక్కరినీ చంద్రమండలానికి తీసుకెళ్తా: ఓ అభ్యర్థి విచిత్ర హామీలు

Arun Kumar P   | Asianet News
Published : Mar 24, 2021, 10:49 AM IST
ఎమ్మెల్యేగా గెలిపిస్తే... ప్రతి ఒక్కరినీ చంద్రమండలానికి తీసుకెళ్తా: ఓ అభ్యర్థి విచిత్ర హామీలు

సారాంశం

దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్ గా శరవణన్ బరిలోకి దిగిన హామీలు చూసి మధురై ప్రజలే కాదు యావత్ తమిళనాడు కాదుకాదు దేశంమొత్తం ఆశ్చర్యానికి గురవుతోంది. 

చెన్నై: ఎన్నికల్లో గెలుపుకోసం ప్రజలకు రాజకీయ నాయకులు హామీలివ్వడం మనం చూస్తుంటాం. ఎన్నికల సమయంలో అయితే తాయిలాలిచ్చి ఓటర్లను ప్రసన్నంచేసుకునే నాయకులు...గెలిచాక అవిచేస్తాం, ఇవిచేస్తాం అంటూ హామీలిస్తుంటారు. తమను గెలిపిస్తే సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉద్యోగాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు, తాగునీరు ఇస్తామంటూ చెబుతుంటారు. అయితే ఇలా అందరీలా హామీలిస్తే తన స్పెషాలిటీ ఏముంటుందని భావించాడో ఏమో గానీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఫోటీ చేస్తున్న ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి  విచిత్రమైన హామీలిచ్చాడు. 

దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్ గా శరవణన్ బరిలోకి దిగాడు. అన్ని రాజకీయ పార్టీలు టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అతడు ఎన్నికల ప్రచారాన్ని భిన్నంగా నిర్వహిస్తున్నాడు. శరవణన్ హామీలు చూసి మధురై ప్రజలే కాదు యావత్ తమిళనాడు కాదుకాదు దేశంమొత్తం ఆశ్చర్యానికి గురవుతోంది. రాజకీయ నాయకుల హామీలు విచిత్రంగా వుంటాయి  కానీ మరీ ఇంత విచిత్రమా అంటూ ఓటర్లు సైతం నోరుళ్లబెడుతున్నారు.

శరవణన్ హామీలు: 

తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల్ని చంద్రమండలం పైకి బ్యాచ్ ల వారీగా తరలింపు

నియోజకవర్గంలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు

ఇళ్లల్లో ఆడవాళ్లు పనికి సాయంగా ఇంటింటికీ ఒక రోబో పంపిణీ

ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి కాల్వలు తవ్వించి ఇంటికో బోటు పంపిణీ

ఎండ వేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడేందుకు300 అడుగుల ఎత్తున కృత్రిమ మంచు కొండ నిర్మాణం

ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమ సముద్రం నిర్మాణం

నియోజక వర్గ ప్రజలందరికీ ఐఫోన్
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?