ఇక ఈ వయసు నుంచే మద్యం.. ప్రభుత్వం నిర్ణయం

By telugu news teamFirst Published Mar 24, 2021, 10:36 AM IST
Highlights

ఇప్పటి వరకు చట్ట పరంగా మద్యం సేవించాలంటే కనీసం 25ఏళ్లు ఉండాలి. కానీ ఇప్పుడు దానిని 21కి కుదిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం అందరికీ తెలుసు.. అయినా కూడా ఆ మత్తులో తూగిపోవాలని అందరూ ఆరాటపడిపోతుంటారు. దీనికి తోడు తాజాగా.. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పలువురిని కలవర పెడుతుండటం గమనార్హం. ఇప్పటి వరకు చట్ట పరంగా మద్యం సేవించాలంటే కనీసం 25ఏళ్లు ఉండాలి. కానీ ఇప్పుడు దానిని 21కి కుదిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కొత్త మద్యం పాలసీ వల్ల మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం 20 శాతం అదనంగా ఆదాయం సమకూరే అవకాశం ఉందిన మనీశ్ సిసోడియా తెలిపారు. అయితే.. కొత్తగా మద్యం స్టోర్లకు మాత్రం అనుమతి ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. దీంతో పాటు లిక్కర్ షాపులను ప్రభుత్వం నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో 60 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయి.

కొత్త మద్యం పాలసీ ప్రకారం.. కనీసం 500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటేనే మద్యం షాపులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తారు. 21 ఏళ్ల లోపు వారికి మద్యం స్టోర్ల వద్దకు అనుమతి లేదు..

మరోవైపు.. ఢిల్లీలో లిక్కర్ మాఫియా ఆగడాలు మీరుతున్నాయి. నగరవ్యాప్తంగా ఢిల్లీ ప్రభుత్వం 850 మద్యం స్టోర్లను నిర్వహిస్తుండగా.. లిక్కర్ మాఫియా 2000 స్టోర్లను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులు గత రెండేళ్లలో 7 లక్షల అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 1939 మందిని అరెస్టు చేశారు.

click me!