మరో యువకుడితో చనువుగా ఉంటోందని.. ప్రియురాలిని..

Published : Mar 24, 2021, 08:46 AM ISTUpdated : Mar 24, 2021, 08:48 AM IST
మరో యువకుడితో చనువుగా ఉంటోందని.. ప్రియురాలిని..

సారాంశం

ప్రియురాలిపై పగ తీర్చుకున్నాడు. ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని ప్లాన్ ప్రకారం కాజేశాడు.

తాను ప్రేమించిన అమ్మాయి తనకు తెలీకుండా మరో యువకుడితో చనువుగా ఉంటోందని ప్రియుడికి అనుమానం కలిగింది. తనను మోసం చేస్తోందని కోపం పెంచుకున్నాడు. అంతే పథకం ప్రకారం.. ప్రియురాలిపై పగ తీర్చుకున్నాడు. ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని ప్లాన్ ప్రకారం కాజేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నగరానికి చెందిన జాకీర్‌ హుసేన్‌ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె కొంతకాలంగా మరొకరితో తిరుగుతోందని కక్ష పెంచుకున్నాడు. ఈక్రమంలో ఆ యువతి ఈనెల 13న చంద్రలేఔట్‌ భైరవేశ్వరనగర్‌ వద్ద వెళ్తుండగా దుండగులు ఆమెను అడ్డగించి రూ.3లక్షల విలువైన 102 గ్రాముల బంగారు నగలు దోచుకున్నారు. 

బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు జాకీర్‌హుసేన్, షాబాజ్‌ఖాన్, ఫాజిల్‌ అనే వ్యక్తులను అరెస్ట్‌ చేసి నగలు స్వాధీనం చేసుకున్నారు. తనను విస్మరిస్తోందనే కక్షతోనే స్నేహితులతో కలిసి దోపిడీకి పాల్పడినట్లు జాకీర్‌హుసేన్‌ విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !