జ‌మ్మూ కాశ్మీర్ లో ఎన్నిక‌లు జరిగితే అంతా సవ్యంగానే ఉంటుంది - కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్

Published : May 03, 2022, 03:38 PM IST
జ‌మ్మూ కాశ్మీర్ లో ఎన్నిక‌లు జరిగితే అంతా సవ్యంగానే ఉంటుంది - కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు చేపడితే అన్ని సర్దుకుంటాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ పార్లమెంటు స్ట్రీట్ మసీదులో నమాజ్ చేసిన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల విష‌యంలో కాంగ్రెస్ సీనియర్ నాయ‌కుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. జమ్ము కాశ్మీర్ లో మరోసారి ఎన్నికలు జరిగితే అంతా సవ్యంగానే ఉంటుందని అన్నారు. ప్ర‌జ‌ల చేతిలో అధికారం పెడితే అంతా స‌ర్దుకుంటుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. 

ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ మసీదులో నమాజ్ చేసిన తరువాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. ‘‘ ఎన్నికలు (కాశ్మీర్ లో) జరిగి అధికారం ప్రజల చేతుల్లో ఉంటే అప్పుడు అంతా సవ్యంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. దేశం కోవిడ్-19 నుండి కొంత ఉపశమనం పొందడం ఆనందదాయకమైన విషయం. కరోనా వల్ల ఎంతో మంది ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. ఇప్పుడైన ప్రజల్లో విద్వేషాలు తొలగిపోవాలి ’’ అని ఆయన అన్నారు.

పీడీపీతో నాయకురాలు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2018 జూన్ లో ప్ర‌భుత్వం నుంచి బీజేపీ వైదొల‌గింది. అప్ప‌టి నుంచి అక్క‌డ రాష్ట్రప‌తి పాల‌న కొన‌సాగుతోంది. 2019 ఆగస్టులో రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కాగా ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఈ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నప్ప‌టికీ శాసన సభను కలిగి ఉంది. 

చాలా కాలంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని అధికారులు పదేపదే హామీ ఇచ్చారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గలేదు. అయితే డీలిమిటేషన్ కమిషన్ తన తుది నివేదికను కొద్ది రోజుల్లో సమర్పించబోతోందని ఇటీవలి నివేదికలు వచ్చాయి. ఈ విష‌యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఏడాది మొద‌ట్లో మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జ‌రుపుతామ‌ని, దాని త‌రువాత ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. మార్చి లో లోక స‌భ స‌మావేశాల్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లుపై చర్చల సందర్భంగా కాశ్మీర్ పై సభ్యులు లేవనెత్తిన ఆందోళనలపై కూడా ఆయన స్పందించారు. జ‌మ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలనలో ఉంచ‌డం త‌మ‌కు ఎలాంటి ఆసక్తి లేదని తెలిపారు. 

కాగా.. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఇటీవల జమ్మూ కాశ్మీర్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు, ఈ ప్రాంతం ‘‘క్లిష్టమైన దశ గుండా వెళుతోంది’’ అని ఆమె తెలిపారు. ‘‘ భద్రతా పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కశ్మీర్లో ఉగ్రవాదం లేని ప్రాంతం లేదు. అయితే రాష్ట్రానికి పర్యాటకం మినహా చాలా తక్కువ ఆర్థిక వనరులు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో నిరుద్యోగ స్థాయి కూడా విప‌రీతంగా పెరిగిపోతోంది ’’ అని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?