'శరవేగం రామమందిర నిర్మాణ పనులు.. ప్రధాని మోదీ చేత రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ..': అయోధ్య ఆలయ ట్రస్ట్

Published : Mar 16, 2023, 05:11 AM IST
'శరవేగం రామమందిర నిర్మాణ పనులు..  ప్రధాని మోదీ చేత రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ..': అయోధ్య ఆలయ ట్రస్ట్

సారాంశం

  రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ తెలిపారు.

అయోధ్య.. నిన్న మొన్నటి వరకూ ఓ వివాదాస్పద ప్రాంతం. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీర్పు  అనంతరం అయోధ్య బాబ్రీ మసీదు స్థానంలో భవ్య రామమందిర నిర్మాణం ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామమందిరం ప్రారంభం తేదీ ఖరారైంది. ప్రపంచ హిందువులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న భవ్య రామమందిరం ఎప్పుడనేది ఖరారైంది.  2024 ఎన్నికలకు కొద్దిగా ముందు భవ్య రామమందిరం ప్రారంభం కానుంది. 2024 మూడో వారంలో రామమందిరం ప్రారంభం కానుందని ప్రభుత్వం ప్రకటించింది.

వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరంలో అసలు స్థానంలో రామలాలా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠించనున్నారు. రామ మందిర నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఆలయ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలియజేశారు. 

2024 జనవరి మూడో వారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహాన్ని అసలు స్థలంలో ప్రతిష్టించనున్నట్లు ఆయన విలేకరులతో అన్నారు. ఆలయ నిర్మాణానికి, 2024 సాధారణ ఎన్నికలకు సంబంధం లేదన్నారు. తాము ఇతర పనులతో సంబంధం లేకుండా నిరంతరం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.  

రామ్ లల్లా విగ్రహాన్ని ఒక  ఆలయానికి మార్చడానికి ముందు చాలా కాలం పాటు గుడ్డ పండల్‌లో ఉంచారని గోవింద్ దేవ్ గిరి మహారాజ్ చెప్పారు. రాముడి అసలు స్థానానికి మార్చాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. విగ్రహాన్ని అసలు స్థానానికి తరలించిన తర్వాత కూడా ఆలయ పనులు కొనసాగుతాయని మహంత్ దేవ్ గిరి తెలిపారు. "జనవరి 2024 లోపు గర్భగుడి, మొదటి అంతస్తు , దర్శన ఏర్పాట్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.

గోవింద్ దేవ్ గిరి మాట్లాడుతూ నేడు భారతదేశం పట్ల ప్రపంచ దేశాల దృక్పథం మారిపోయిందని అన్నారు. యోగా, ఆయుర్వేదం, భారతీయ సంగీతం ప్రపంచ వ్యాప్తంగా వచ్చాయని, రానున్న కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సాంస్కృతిక విప్లవం వస్తుందని అన్నారు.

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అయోధ్యలో పర్యటన 

కాగా, ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి అయోధ్యను సందర్శిస్తారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సన్నిహితుడు బుధవారం తెలిపారు. మార్చి 25తో ముగిసిన బడ్జెట్‌ సమావేశాల తర్వాత సీఎం షిండే అయోధ్యకు వెళ్లి శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పారు. షిండే 2022 జూన్‌లో అప్పటి మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఆదిత్య ఠాక్రేతో కలిసి అయోధ్యను సందర్శించారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?