ముంబై భేటీలో భవిష్యత్తు కార్యాచరణ: బీజేపీపై రాహుల్ ఫైర్

Published : Jul 18, 2023, 05:09 PM IST
 ముంబై భేటీలో  భవిష్యత్తు  కార్యాచరణ: బీజేపీపై  రాహుల్ ఫైర్

సారాంశం

విపక్ష కూటమి తదుపరి సమావేశం ముంబైలో సమావేశం కానుంది.ఈ సమావేశంలో  కీలక నిర్ణయాలను వెల్లడించనున్నట్టుగా రాహుల్ గాంధీ ప్రకటించారు. 

బెంగుళూరు: బీజేపీ సిద్దాంతాలతోనే తమ కూటమి పోరాటం చేస్తుందని  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు.రెండు రోజుల పాటు  బెంగుళూరులో విపక్ష పార్టీల సమావేశం  జరిగింది.ఈ సమావేశం ముగిసిన తర్వాత  రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం దేశాన్ని ఆక్రమించేందుకు  బీజేపీ ప్రయత్నిస్తుందని రాహుల్ గాంధీ  విమర్శించారు. 

ఇది బీజేపీ, విపక్ష పార్టీల మధ్య యుద్ధం కాదన్నారు. ఇది దేశ ప్రజల స్వతంత్రం,స్వేచ్ఛ కోసం  చేస్తున్న యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. తమ పోరాటం  ఎన్డీఏ వర్సెస్ ఇండియాగా ఉంటుందన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందన్నారు. కొద్దిమంది చేతుల్లోకి దేశం వెళ్లిపోతుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం  చేశారు.   ద్వేషాన్ని పెంచుతున్నారు,

also read:విపక్ష కూటమికి ఇండియాగా నామకరణం: ఎన్డీఏ భేటీపై ఖర్గే సెటైర్లు

ధరలు పెరుగుతున్నా కూడ పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. రెండు ఆలోచనల విధానాలకు  వ్యతిరేకంగా పోరు సాగుతుందన్నారు. ఇండియాను రక్షించేందుకు తాము పోరాటం చేస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. ఇండియాను  వ్యతిరేకించేవారికి ఏ గతి పడుతుందో మీకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.తమ ఆలోచనా విధానం దేశం కోసమేనని  రాహుల్ గాంధీ  చెప్పారు. తమ యాక్షన్ ప్లాన్ ను  ముంబై సమావేశంలో ప్రకటిస్తామన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !