ఢిల్లీ లిక్కర్ స్కాం: కేజ్రీవాల్, సోరేన్ పై మరాండీ విమర్శలు

Published : Jul 18, 2023, 04:04 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం:  కేజ్రీవాల్, సోరేన్ పై  మరాండీ విమర్శలు

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎంలపై  మాజీ సీఎం, బీజేపీ నేత  బాబులాల్ మరాండీ  ఆరోపణలు చేశారు. 

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న  ఢిల్లీ సీఎం, జార్ఖండ్ సీఎంలపై  బీజేపీ నేత బాబులాల్ మరాండీ విమర్శలు చేశారు. విపక్ష కూటమి సమావేశంలో ఈ ఇద్దరు నేతలు మాట్లాడుకుంటున్న ఫోటోతో  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ఢీల్లీ లిక్కర్ స్కాంలో  పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారని ఆయన విమర్శలు చేశారు.తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సీఎంలు కూడ ఇక్కడ  ఉండాల్సి ఉందన్నారు.  లిక్కర్ స్కాంలో  మద్యం కంపెనీలకు, మాఫియాకు  ప్రయోజనం చేకూర్చారని ఆయన ఆరోపణలు  చేశారు. నకిలీ హోలో గ్రామ్ లు తయారు చేసి  కోట్లాది రూపాయాలను తమ జేబుల్లో వేసుకున్నారని ఆయన ఆరోపించారు.జార్ఖండ్ మొట్టమొదటి సీఎంగా బాబులాల్ మరాండీ పనిచేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా  మరాండీ  ఇటీవలనే బాధ్యతలను చేపట్టారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!