వాళ్లకి టెస్ట్‌లు అక్కర్లేదు.. కరోనా పరీక్షా విధానంలో ఐసీఎంఆర్ కీలక మార్పులు

By Siva Kodati  |  First Published May 4, 2021, 8:26 PM IST

కరోనా పరీక్షా విధానంలో ఐసీఎంఆర్ కీలక సూచనలు చేసింది. కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యే పేషెంట్లకు టెస్ట్‌లు అవసరం లేదని తెలిపింది. రాపిడ్ యాంటిజన్ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే.. మళ్లీ పరీక్ష అవసరం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.


కరోనా పరీక్షా విధానంలో ఐసీఎంఆర్ కీలక సూచనలు చేసింది. కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యే పేషెంట్లకు టెస్ట్‌లు అవసరం లేదని తెలిపింది. రాపిడ్ యాంటిజన్ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే.. మళ్లీ పరీక్ష అవసరం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.

ఆరోగ్యంగా వున్న ప్రయాణికులకు కరోనా టెస్ట్ నిబంధనను తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే ప్రయాణికులంతా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. మరోవైపు భారత్‌లో మూడో విడత కరోనా కల్లోలం రావచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు.

Latest Videos

undefined

రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌ల వల్ల పెద్దగా ఉపయోగం వుండదని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ విధిస్తే ఫలితం ఉండొచ్చని రణ్‌దీప్ స్పష్టం చేశారు. కనీసం రెండు వారాలు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని ఎయిమ్స్ డైరెక్టర్ పేర్కొన్నారు. 

Also Read:కరోనా సెకండ్ వేవ్ : ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాప్తి... !!

మరోవైపు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,57, 229 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,449 మంది కరోనాతో మృతి చెందారు. 

24 గంటల్లో 3,20,289 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ కొత్త కేసులతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 2,02,82,833కి చేరుకున్నాయి. కాగా కరోనా నుంచి కోలుకున్నవారి సంక్య 1,66,13,292గా ఉంది. 

అలాగే ప్రస్తుతం 34,47,133 యాక్టీవ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 2,22,408గా ఉంది. ఇప్పటివరకు 15,89,32,921 మంది కోవిడ్ టీకా తీసుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. 
 

click me!