ఫ్లాస్మాథెరపీ, రెమ్‌డిసివర్‌లు అదేపనిగా వాడొద్దు.. అదే వైరస్‌కు బలం, నిపుణుల హెచ్చరిక

By Siva KodatiFirst Published May 14, 2021, 3:31 PM IST
Highlights

దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ దారుణమైన పరిస్ధితులను సృష్టిస్తోంది. ఎన్నో కష్టాలకొర్చి వైరస్ నుంచి బతికి బట్టకడితే ఇప్పుడు కొత్తగా వస్తున్న అనారోగ్య సమస్యలు ప్రజలకు కంటిమీద కునుకు రానివ్వడం లేదు. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ దాడితో మహారాష్ట్ర, గుజరాత్‌లలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే. 

దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ దారుణమైన పరిస్ధితులను సృష్టిస్తోంది. ఎన్నో కష్టాలకొర్చి వైరస్ నుంచి బతికి బట్టకడితే ఇప్పుడు కొత్తగా వస్తున్న అనారోగ్య సమస్యలు ప్రజలకు కంటిమీద కునుకు రానివ్వడం లేదు. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ దాడితో మహారాష్ట్ర, గుజరాత్‌లలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నిపుణులు వీటిపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా విచ్చలవిడి ప్లాస్మా చికిత్స, రెమ్‌డెసివిర్‌ వినియోగంతో కరోనా వైర్‌సలో మ్యూటేషన్లు వచ్చి, అది మరింత బలోపేతమయ్యే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ రమణ్‌ గంగాఖేడ్కర్‌ హెచ్చరించారు.

ఒకవైపు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దాడితో వైరస్‌లో  ఉత్పరివర్తనాలు వచ్చే ముప్పుంటుందన్నారు. దీనికితోడు సమయం, సందర్భం లేకుండా రెమ్‌డెసివిర్‌, ప్లాస్మా థెరపీని విచ్చలవిడిగా వినియోగిస్తే వైరస్‌ మరింత శక్తిమంతమవుతుందని రమణ్ వివరించారు.

Also Read:టీకాలే లేనప్పుడు ‘చిరాకెత్తించే..’ ఆ డయలర్ టోన్ ఎందుకు?.. ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు..

ఇలా జరగకుండా ప్రభుత్వం వైద్యులకు, ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని.. ప్లాస్మా థెరపీని, రెమ్‌డెసివిర్‌ వినియోగాన్ని నియంత్రించాలని ఆయన సూచించారు. భారత్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు కోవిడ్ బారిన పడుతున్నారని.. వారికి ఇలా విచ్చలవిడి చికిత్సలు చేస్తే వైర్‌సలో వచ్చే మ్యుటేషన్లు వ్యాక్సిన్ల వల్ల వచ్చే రక్షణ వ్యవస్థను కూడా తప్పించుకునేవిగా మారే ప్రమాదం ఉందన్నారు.

ఇది భారత్‌తో పాటు ప్రపంచానికీ ప్రమాదమేనని ఆయన హెచ్చరించారు. వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ సెకండ్‌ వేవ్‌లో నిరూపితమైన చికిత్సలకు మాత్రమే పరిమితం కాకపోతే కొత్త వేరియంట్లకు భారత్‌ బ్రీడింగ్‌ గ్రౌండ్‌గా మారుతుందని రమణ్ హెచ్చరించారు.

click me!