కన్నుగీటి పాపులరైన ఐఏఎస్ అధికారి... నకిలీ ఫేస్ బుక్ తో..

By telugu teamFirst Published Dec 18, 2019, 1:02 PM IST
Highlights

 'ఐఏఎస్‌ టీనా దాబి' పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా వెలువడటంపై టీనా దాబీ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్‌ఐకు వివరణ ఇచ్చారు. అది నకిలీ ఖాతా అని, ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఇలా తప్పుడు మార్గాలను ఎంచుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు

ఇటీవల కాలంలో కన్నుగీటి పాపులర్ అయిన ఐఏఎస్ అధికారి టీనా దాబి గుర్తుండే ఉంటుంది. ఆమె ఫేస్ బుక్ ఖాతాని కొందరు వ్యక్తులు హ్యాక్ చేశారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా పౌరసత్వ బిల్లు గురించి చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లును పలుచోట్ల వ్యతిరేకిస్తున్నారు. నిరసన జ్వాలలు కూడా వ్యక్తమౌతున్నాయి. కాగా...ఈ వివాదంలోని ఐఏఎస్ అధికారి టీనా దాబిని కూడా కొందరు వ్యక్తులు లాగారు.

మంగళవారం ఐఏఎస్‌ అధికారిణి టీనా దాబి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా హిందీ భాషలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 'ఐఏఎస్‌ టీనా దాబి' పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా వెలువడటంపై టీనా దాబీ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్‌ఐకు వివరణ ఇచ్చారు. అది నకిలీ ఖాతా అని, ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఇలా తప్పుడు మార్గాలను ఎంచుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు


కాగా ఢిల్లీకి చెందిన దళిత యువతి టీనా దాబి నాలుగు సంవత్సరాల క్రితం (2015) ఆల్‌ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ర్యాంకును కైవసం చేసుకొన్నారు. ఆ తర్వాత తన బ్యాచ్‌మేట్‌ అయిన కశ్మిరీ ఐఏఎస్‌ అథర్‌ ఖాన్‌ను ప్రేమించి.. గతేడాది పెళ్లి చేసుకున్నారు. తరువాత, ఇద్దరికి రాజస్థాన్‌లోని భిల్వారాలో పోస్టింగ్‌ లభించింది. కాగా టీనా భర్త అథర్‌ సివిల్‌ సర్వీసెస్‌లో రెండవ ర్యాంకు సాధించడం విశేషం.  ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబర్ 31 న లేదా అంతకు ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు త్వరితగతిన భారత పౌరసత్వం కల్పించేందుకు వీలుగా పౌరసత్వ సవరణ చట్టం రూపొందించిన విషయం తెలిసిందే

click me!