కోర్టు రూంలో నిందితుడి కాల్చివేత: 18 మంది పోలీసుల సస్పెన్షన్

By telugu teamFirst Published Dec 18, 2019, 12:21 PM IST
Highlights

కోర్టు రూంలో హత్య కేసు నిందితుడిని కాల్చి చంపిన ఘటనలో 18 మంది పోలీసులు సస్పెన్షన్ కు గురయ్యారు. జంట హత్య కేసులో నిందితుడైన అన్సారీని ముగ్గురు వ్యక్తులు కోర్టు రూంలో కాల్చిన చంపిన విషయం తెలిసిందే.

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ కోర్టు రూంలో ఓ హత్య కేసు నిందితుడిని దుండగులు కాల్చివేసిన సంఘటనలో 18 మంది పోలీసులు సస్పెన్షన్ కు గురయ్యారు. జంట హత్య కేసులో నిందితుడైన వ్యక్తిని కోర్టు రూంలోనే కాల్చివేశారు. ఈ సంఘటనలో గాయపడిన ఓ పోలీసు, కోర్టు సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

జంట హత్య కేసులో నిందితుడైన షానవాజ్ అన్సారీని బిజ్నోర్ జిల్లా కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టినప్పుడు ఆ సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులో పిస్టల్స్ తో కోర్టు రూంలోకి వచ్చి అన్సారీపై కాల్పులు జరిపారు. పోలీసులు వెంటాడి నిందితులను పట్టుకున్నారు. 

Also Read: కోర్టు రూంలోనే హత్య కేసు నిందితుడ్ని కాల్చి చంపారు

కోర్టు రూంలో కాల్పులకు న్యాయమూర్తితో సహా ప్రతి ఒక్కరూ బిత్తరపోయారు. కాల్పులు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు నేలపై ఒరిగిపోయి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నించారు. 

బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) నేత హజి అహసన్ ఖాన్, అతని బంధువులను హత్య చేసిన కేసులో అన్సారీ నిందితుడు. ఈ జంట హత్యలు మేలో జరిగాయి.  

click me!