
కాన్పూర్ : సీనియర్ IAS అధికారిణి subhra saksena తన ex-husband Shashank Gupta తనను, తన తొమ్మిదేళ్ల కుమార్తెను వేధించాడని, బెదిరించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెదిరింపు, పరువు నష్టం, IPCలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద ఆరోపణలపై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో IAS అధికారి ఫిర్యాదు చేశారు. ఆమె తన మాజీ భర్తతో పాటు అతని ఎనిమిది మంది బౌన్సర్‌లు తనను వెంబడించి తను ఎక్కడుందో కనిపెట్టడానికి ప్రయత్నించారని కూడా ఆమె ఆరోపించింది.
మార్చి 5న, సక్సేనా, ఆమె కుమార్తె యుపిలోని కాన్పూర్ జిల్లా జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) అయిన తన స్నేహితురాలు నేహా శర్మను కలవడానికి కాన్పూర్ వచ్చారు. ఆ సమయంలో తన మాజీ భర్త తన మొబైల్‌లో మెసేజ్ చేసి బెదిరించాడని, దానికి తాను స్పందించకపోవడంతో నిందితులు డీఎం నేహా శర్మకు ఫోన్ చేసి దుర్భాషలాడారని ఆమె ఆరోపించింది.
శుభ్ర సక్సేనా, శశాంక్ గుప్తా జంట జూన్ 2003 లో వివాహం చేసుకున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. పెళ్లి తరువాత శశాంక్ గుప్త ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తుండడంతో చాలా గొడవల తరువాత 2020, జూలైలో విడాకులు తీసుకున్నామని ఆమె తెలిపారు.
సక్సేనా చెబుతున్న వివరాల ప్రకారం, విడాకుల తర్వాత, శశాంక్ గుప్తా ఆమెను వదలలేదు. ఆమెను, ఆమె కుమార్తెను ఎక్కడికి వెడితే అక్కడికి వెంబడించడం, బెదిరించడం ప్రారంభించాడు. కూతురిని కలిసే హక్కు విషయంలో కూడా దంపతుల మధ్య వివాదం నడుస్తోంది.
సక్సేనా లక్నోలోని గోమతి నగర్, సుశాంత్ గోల్ఫ్ సిటీలోని సెలబ్రిటీ గ్రీన్స్ లో ఉంటున్నాడు. రెండు నెలల క్రితం, లక్నో లో ఉంటున్న IAS అధికారి నివాసానికి శశాంక్ గుప్తా వచ్చి ఆమెను భయపెట్టడానికి ప్రయత్నించాడు. దీంతో సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందయ్యింది.