చంద్రకళ ఇంటిపై సిబిఐ దాడులు: ఆమెది కరీంనగర్ జిల్లా

By pratap reddyFirst Published Jan 5, 2019, 12:42 PM IST
Highlights

ఐఎఎస్ అధికారి బి. చంద్రకళ ఇంట్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమెది తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా. అవినీతికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారిగా చంద్రకళకు పేరుంది.

లక్నో: ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లోని 12 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) శనివారం దాడులు నిర్వహించింది. అక్రమ ఇసుక తవ్వకం కేసుకు సంబంధించి ఈ దాడులు జరిగాయి.

పలువురు సీనియర్ అధికారుల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. ఐఎఎస్ అధికారి బి. చంద్రకళ ఇంట్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమెది తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా. అవినీతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్న అధికారిగా చంద్రకళకు పేరుంది. 

చంద్రకళ హవలోక్ రోడ్డులోని సఫైర్ అపార్టుమెంటులో నివసిస్తున్నారు. ఈ నివాసంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు ఇంకా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా కరీంనగర్ జిల్లాలో కూడా సిబిఐ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జలౌన్, హమీర్ పూర్, లక్నోల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా సిబిఐ అధికారులు నిర్వహించారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసులో రంగంలోకి దిగింది.

click me!