అభినందన్ విడుదలపై వీడని ఉత్కంఠ: అప్పగించలేదంటున్న పాకిస్థాన్

By Nagaraju penumalaFirst Published Mar 1, 2019, 8:50 PM IST
Highlights

కానీ ఎక్కడా అభినందన్ ను అప్పగించినట్లు స్పష్టమైన ప్రకటన చెయ్యడం లేదు. పాకిస్థాన్ ఇప్పటికే పార్లమెంట్ లో అభినందన్ ను శుక్రవారం అప్పగిస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
వాఘా: పాకిస్థాన్ ఆర్మీ చేతిలో బంధీ అయిన ఐఏఎఫ్ పైలట్ అభినందన్ విడుదలపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. అభినందన్ విడుదలపై అటు భారత్ విదేశాంగ శాఖ కానీ పాకిస్థాన్ విదేశాంగ శాఖ కానీ ఎలాంటి ప్రకటన విడుదల చెయ్యలేదు. 

అభినందన్ విడుదలపై వాఘా బోర్డర్ వద్ద కొద్దిగంటలుగా భారతదేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భారత దైత్యవేత్తలకు అప్పగించారంటూ తొలుత వార్తలు వచ్చాయి. అయితే అభినందన్ ను ఇంకా అప్పగించలేదంటూ పాకిస్థాన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అభినందన్ విడుదలపై గందరగోళం నెలకొంది. 

మరోవైపు దౌత్యపరమైన టెక్నికాలిటీస్ పూర్తి చెయ్యడంలో ఆలస్యం అయినందు వల్లే అభినందన్ విడుదల ఆలస్యం అయ్యిందంటూ వార్తలు వినబడుతున్నాయి. ఇమ్మిగ్రేషన్, ఇంటీగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద అభినందన్ ను తీసుకునేందుకు భారత్ కు సంబంధించి అధికారులు వేచి ఉన్నారు. 

click me!