ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు భయపడబోను - పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో

By team teluguFirst Published Dec 19, 2022, 9:09 AM IST
Highlights

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను చరిత్ర ఆధారంగా మాట్లాడానని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీకి తాను భయపడబోనని తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భుట్టో స్పందించారు. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్ఎస్ఎస్ కు, బీజేపీకి భయపడబోనని అన్నారు. రెండు రోజుల కిందట తాను చేసిన వ్యాఖ్యలు చరిత్ర ఆధారంగా ఉన్నాయని, వాటిని తుడిచివేయలేమని అన్నారు. “ఈ నిరసనల ఉద్దేశ్యం పాకిస్తాన్‌ను భయపెట్టడమే అయితే అది పని చేయదు. ఆర్‌ఎస్‌ఎస్‌కు మేం భయపడం. మోడీకి మేం భయపడం. బీజేపీకి మేం భయపడం. నిరసన తెలియజేయాలనుకుంటే, చేయండి’’ అని భుట్టో చెప్పినట్లు ‘డాన్’ పేర్కొంది.

పంటపొలాల్లో సగం కాలిన మృతదేహం.. కాళ్ళూ, చేతులు వైర్‌తో కట్టేసి హత్య..

‘‘ప్రస్తుత భారత ప్రధాని గుజరాత్‌లో పోషించిన పాత్రకు చరిత్రే నిదర్శనం. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఎన్ని నిరసనలు చేసినా చరిత్రను వక్రీకరించలేరు ’’ అని బిలావల్ భుట్టో అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తోందని, ప్రపంచం మొత్తం ఆ దేశాన్ని ఉగ్రవాద కేంద్రంగా చూస్తోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో  అన్నారు. దీంతో ఆగ్రహించిన బుట్టో ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్ ను దూషించారు. 

త్రిపుర ఈశాన్య రాష్ట్రాలకు అంతర్జాతీయ వాణిజ్య గేట్‌వేగా ఎదుగుతోంది: ప్రధాని మోడీ

మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అమెరికా వీసా నిరాకరించిందని, ప్రధాని అయ్యాకే వీసా వచ్చిందని భుట్టో అన్నారు. ఒసామా బిన్ లాడెన్ చనిపోయారని, కానీ కసాయి ఇంకా బతికే ఉన్నాడని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసింది. అనేక చోట్ల ప్రదర్శనలు నిర్వహించి, భుట్టో దిష్టిబొమ్మలను దహనం చేసింది. పలువురు మంత్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

త్వరలో దేశంలో బీఎస్ఎన్ఎల్ 5జీ .. కేంద్ర మంత్రి సంకేతాలు, ఎప్పటి నుంచి అంటే..?

భుట్టోకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా ఉండటానికి అర్హత లేదు అని  కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ ఆదివారం అన్నారు. ‘‘ ఆయన భుట్టో) పాకిస్థాన్ రాజకీయాలను కూడా అర్థం చేసుకోలేడు. అతడు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఎలా అయ్యాడో నాకు అర్థం కాలేదు. అతడికి పాకిస్థాన్  నాయకుడిగా ఉండేందుకు అర్హత లేదు.’’ అని తెలిపారు. 

ఇండియాలో సమస్యలను పరిష్కరించడానికి దేవుడే ఆప్‌ను ఎంచుకున్నాడు: అరవింద్ కేజ్రీవాల్

‘‘ ప్రధాని మోదీతో మా పోరాటం సైద్ధాంతికమైనది, వ్యక్తిగతమైనది కాదు. 2002లో నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఘటన మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నాను. కానీ మన ప్రధాని గురించి ఇలా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.’’ అని ఆయన అన్నారు. 
 

click me!