కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో బీజేపీ పతనం ప్రారంభమైతే సంతోషిస్తా: మమతా బెనర్జీ

By Mahesh RajamoniFirst Published May 5, 2023, 1:05 AM IST
Highlights

Karnataka Assembly Election: "బీజేపీని ఎంత త్వరగా గద్దె దింపితే దేశానికి అంత మంచిది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దు. మీకు నచ్చిన ఇతర పార్టీకి ఓటు వేయండి. బీజేపీ పతనం కర్ణాటకతో ప్రారంభమైతే సంతోషిస్తాను. హిందూ మతంలోని ఆధ్యాత్మికతను బీజేపీ నాశనం చేసింది" అని తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

West Bengal Chief Minister Mamata Banerjee: మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌త‌నం ప్రారంభమైతే తాను సంతోషిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ గురువారం అన్నారు. బీజేపీని ఎంత త్వరగా గద్దె దింపితే దేశానికి అంత మంచిదని పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని కోరారు. ఓట‌ర్లు త‌మ‌కు న‌చ్చిన ఇతర రాజ‌కీయ‌ పార్టీల‌కు ఓటు వేయాల‌ని సూచించారు. బీజేపీ పతనం కర్ణాటకతో ప్రారంభమైతే తాను సంతోషిస్తానని కూడా చెప్పారు. బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. హిందూ మతంలోని ఆధ్యాత్మికతను కాషాయ పార్టీ నాశనం చేసిందని ఆరోపించారు. 

"బీజేపీని ఎంత త్వరగా గద్దె దింపితే దేశానికి అంత మంచిది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దు. మీకు నచ్చిన ఇతర పార్టీకి ఓటు వేయండి. బీజేపీ పతనం కర్ణాటకతో ప్రారంభమైతే సంతోషిస్తాను. హిందూ మతంలోని ఆధ్యాత్మికతను బీజేపీ నాశనం చేసింది" అని తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. అలాగే, జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులకు, నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మధ్య జరిగిన ఘర్షణపై మమతా బెనర్జీ కేంద్రాన్ని నిలదీశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లపై గత రాత్రి పోలీసులు దాడి చేశారు. అక్కడకు ఎన్ని కేంద్ర బృందాలను పంపించారు? అంటూ ప్ర‌శ్నిస్తూ.. బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు.

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. గురువారం (మే 4) తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు తమపై దాడి చేశారని నిరసన తెలుపుతున్న రెజ్లర్లు ఆరోపించారు. "మా రెజ్లర్లను దెబ్బతీసే సాహసం చేయవద్దు" అని మమతా అన్నారు. "ఇలా మన ఆడబిడ్డల గౌరవానికి భంగం కలిగించడం సిగ్గుచేటన్నారు. భారతదేశం తన కుమార్తెలకు అండగా నిలుస్తుంది. ఒక మనిషిగా నేను ఖచ్చితంగా మన రెజ్లర్లకు అండగా ఉంటాను. చట్టం అందరికీ ఒక్కటే. 'పాలకుల చట్టం' ఈ పోరాట యోధుల గౌరవాన్ని హైజాక్ చేయదు. మీరు వారిపై దాడి చేయవచ్చు కాని వారి స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేరు. పోరాటం సరైనదేనని, పోరాటం కొనసాగుతుందన్నారు. మా రెజ్లర్లను బాధపెట్టే సాహసం చేయవద్దు.. దేశం వారి కన్నీళ్లను చూస్తోంది, దేశం మిమ్మల్ని క్షమించదు. మన రెజ్లర్లు బలంగా ఉండాలని నేను కోరుతున్నాను.. నేను వారితో నా శక్తినంతా పంచుకుంటాను" అని ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పేర్కొన్నారు.

click me!