బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుకు మంత్రి శివకుమార్ బంపర్ ఆఫర్

Published : Jul 18, 2019, 04:30 PM ISTUpdated : Jul 18, 2019, 04:35 PM IST
బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుకు మంత్రి శివకుమార్  బంపర్ ఆఫర్

సారాంశం

కర్ణాటక అసెంబ్లీలో గురువారం నాడు ఆసక్తిరక పరిణామాలు చోటు చేసుకొన్నాయి, బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుతో మంత్రి శివకుమార్ చర్చించారు. తమ పార్టీలో చేరితే డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. తాను బీజేపీలోకి  శివకుమార్‌ను ఆహ్వానించినట్టుగా  శ్రీరాములు స్పష్టం చేశారు.   

బెంగుళూరు: తమతో చేతులు కలిపితే డిప్యూటీ  సీఎం పదవిని ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములుకు కాంగ్రెస్ మంత్రి డికె శివకుమార్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు.  గురువారం నాడు విశ్వాస పరీక్ష సందర్భంగా  ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి.

గురువారం నాడు  అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత, మంత్రి శివకుమార్  బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుతో చర్చించారు.  తమతో చేతులు కలపాలని ఆఫర్ ఇచ్చాడు.  అయితే తానే  శివకుమార్‌ను బీజేపీలో చేరాలని  కోరినట్టుగా  ఎమ్మెల్యే శ్రీరాములు ప్రకటించారు.  తాను కాంగ్రెస్ లో చేరబోనని ఆయన తేల్చి చెప్పారు.

అసెంబ్లీలో శ్రీరాములు వైపు చూస్తూ సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి శివకుమారలు చేతులు ఊపారు. ఆ తర్వాత కొద్దిసెకన్లలోనే  శివకుమార్ శ్రీరాములుతో చర్చించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరితే  డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని  ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. తనకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ నేతలు సహృదయంతో వ్యవహరించలేదన్నారు. శివకుమార్ తనకు మధ్య ఎలాంటి రాజకీ చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?