Latest Videos

విద్యార్ధి దశలో ఎన్‌సీసీ శిక్షణ నాకు పనికొచ్చింది‌‌: ప్రధాని మోడీ

By narsimha lodeFirst Published Jan 28, 2022, 1:49 PM IST
Highlights

న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగిన ఎన్‌సీసీ కాడెట్ ర్యాలీని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు పరిశీలించారు. 
 

న్యూఢిల్లీ: గతంలో తాను కూడా ఎన్‌సీసీలో చురుకుగా పాల్గొన్నానని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేసుకొన్నారు. న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో నేషన్ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీని ప్రధాని Narendra Modi శుక్రవారం నాడు పరిశీలించారు.
ప్రతి ఏటా జనవరి 28 Republic Day  క్యాంప్ ముగింపును నిర్వహించనున్నారు. ఆర్మీ యాక్షన్, స్లిథరింగ్ మైక్రోలైట్ ఫ్లయింగ్, పారా పైలింగ్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు తమ నైపుణ్యాలను ప్రధాని వీక్షించారు.. అత్యుత్తమప్రతిభను కనబర్చిన NCC   క్యాడెట్లకు ప్రధాని పతకాలను ప్రధానం చేశారు.

 ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ప్రస్తుతం ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకొంటున్న సమయంలో ఎన్‌సీసీ ర్యాలీ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను కూడా మీ మాదిరిగానే ఎన్‌సీసీలో చురుకుగా క్యాడెట్ గా ఉన్నందుకు తాను గర్వ పడుతున్నానని ఆయన  చెప్పారు.  ఎన్‌సీసీలో తాను నేర్చుకొన్న శిక్షణ తనకు ఉపయోగపడుతుందని మోడీ చెప్పారు.

click me!