15 ఏళ్లుగా హిందువుగా పేరు మార్చుకొని.. బెంగ‌ళూర్ లో ఉంటున్న బంగ్లాదేశ్ మ‌హిళ అరెస్టు..

By team teluguFirst Published Jan 28, 2022, 1:12 PM IST
Highlights

హిందువుగా పేరు మార్చుకొని 15 ఏళ్లుగా ఇండియాలో ఉంటున్న ఓ బంగ్లాదేశ్ మహిళను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆమె 12 ఏళ్ల వయసులో భారత్ కు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. 

ఆమె బంగ్లాదేశ్ (bangladesh)కు చెందిన ఓ ముస్లిం మ‌హిళ‌. అయితే హిందువుగా పేరు మార్చుకొని ఇండియాలో నివ‌సిస్తోంది. ఇలా 15 ఏళ్లుగా బెంగ‌ళూరులో ఉంటోంది. అయితే ఈ విష‌యంలో ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) నుంచి పోలీసుల‌కు స‌మ‌చారం రావ‌డంతో గురువారం ఆమె అరెస్టు అయ్యారు. 

బెంగ‌ళూరు పోలీసులు అరెస్టు చేసిన బంగ్లాదేశ్ మ‌హిళ‌ను 27 ఏళ్ల రోనీ బేగంగా (roni begum) గుర్తించారు. ఆమె తన పేరును పాయల్ ఘోష్ గా మార్చుకున్నారు. మంగళూరుకు చెందిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ నితిన్ కుమార్‌ (delivery excutive nithin kumar) ను వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆమె భ‌ర్త నితిన్ పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. మూడు నెలల పాటు జరిపిన సోదాల తర్వాత మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రోనీ బేగం త‌న 12 ఏళ్ల వయస్సులో ఇండియాకు వ‌చ్చారు. త‌రువాత ముంబైలోని ఓ డ్యాన్స్ బార్‌ (dance bar)లో డ్యాన్సర్‌ (dancer)గా పనిచేసింది. ఆమె త‌న‌ను తాను బెంగాలీ అని చెప్పుకొని పేరును పాయల్ ఘోష్ (poyal ghosh) గా మార్చుకుంది. ఆ సమయంలో నితిన్ అనే వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డింది. కొంత కాలం త‌రువాత ఆయ‌న‌ను పెళ్లి చేసుకుంది. ఈ జంట పెళ్లి తర్వాత 2019లో బెంగళూరులోని అంజననగర్‌ (anjananager)లో స్థిరపడ్డారు. మహిళ టైలర్‌గా పనిచేసేది. ముంబైలో ఉన్న సమయంలోనే ఈ జంట పాన్ కార్డును (pan card) పొందారు. నితిన్ బెంగళూరులోని త‌న స్నేహితుడి సహాయంతో ఆధార్ కార్డు (aadhar card)ను పొందారు. 

ఎలా భ‌య‌ట‌ప‌డిందంటే ? 
కొంత కాలం క్రితం రోనీ బేగం తండ్రి చనిపోయారు. దీంతో ఆమె తండ్రి అంత్య‌క్రియల కోసం బంగ్లాదేశ్ కు వెళ్లాల‌ని భావించారు. అయితే ముందుగా కోల్‌కతా (kolkatha)వెళ్లి అక్కడి నుంచి ఢాకా (dhaka) వెళ్లాలనేది ఆమె ప్లాన్. అయితే ఈమె విష‌యంలో ఇమిగ్రేష‌న్ (immigration) అధికారుల‌కు అనుమానం వ‌చ్చింది. రోని బేగంను విచారించారు. అనంత‌రం ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. స్వదేశానికి వెళ్లడం మానుకోవాలని వారు ఆమెకు సూచించారు. విచార‌ణ సంద‌ర్భంగా రోని బేగం అక్ర‌మ వ‌ల‌స‌దారు అని తేలింది. 

అధికారులు బంగ్లాదేశ్ కు వెళ్ల‌నివ్వ‌క‌పోవ‌డంతో తిరిగి రోని బేగం బెంగళూరుకు వ‌చ్చారు. అయితే ఆమె గురించి  ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) అధికారులు బెంగళూరు పోలీసు కమిషనర్‌కు సమాచారం అందించారు. దీంతో బ్యాదరహళ్లి (byadarahalli) పోలీసులు కేసు నమోదు చేశారు. ఎట్ట‌కేల‌కు ఆమెను అరెస్టు చేశారు. రోని బేగం పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు పొందేందుకు ఆమెకు సహకరించిన వ్యక్తులను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నట్లు వెస్ట్ డీసీపీ సంజీవ్ పాటిల్ (dcp sanjeev patil) తెలిపారు.

click me!