
Former Kerala CM Oommen Chandy's daughter Dr Maria: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని తాను ఎప్పుడూ అలా చూడలేదనీ, ఆయనే తన బలం అంటూ కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ గురించి ఆయన కుమార్తె డాక్టర్ మరియా ఉమెన్ ఫేస్ బుక్ లో ఒక ఎమోషనల్ పోస్టు చేశారు. అందులో ఆయన ప్రస్తుతం పరిస్థితి, తనతో, ప్రజలతో తన తండ్రి అనుబంధం గురించి ఆమె ప్రస్తావించారు.
మరియా ఉమెన్ తన పోస్టులో.. తన తండి ఉమెన్ చాందీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనీ, ఈ సమయంలో వచ్చే సందర్శకులను అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరిమితం చేశారు. అయితే, వచ్చిన వారి గురించి తాము చాందీకి సమాచారం ఇచ్చేవాళ్లమనీ, ఆయన తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. కేంద్రమంత్రి వి.మురళీధరన్ వస్తున్నారని తెలియగానే అనారోగ్యంతో ఆయన బలహీనంగా ఉన్నప్పటికీ మంత్రిని వ్యక్తిగతంగా కలవాలని పట్టుబట్టారని చెప్పారు.
"గొంతునొప్పికి బెంగళూరులో చికిత్స పొందుతూ.. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న అప్పా గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఆయన వార్తలను ఫాలో అవుతూ తనకు చేతనైనంత విషయాలను తెలుసుకునీ, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు" అని కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ గురించి తన కూతురు డాక్టర్ మరియా వివరించారు. గత వారం నిమ్స్ ఆసుపత్రిలో న్యుమోనియా చికిత్స కోసం ఐసీయూలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గురించి వివరిస్తూ.. ఆ ఘటన సాయం అవసరమైన వారి పట్ల ఆయన శ్రద్ధ, నిబద్ధతను మరోసారి తనకు చూపించిందని మరియా ఉమెన్ పేర్కొన్నారు.
"అప్పా ఎల్లప్పుడూ నా బలానికి మూలస్తంభం.. కాబట్టి ఆయన అనారోగ్యంతో నేను వ్యక్తిగతంగా ఆందోళనకు గురయ్యాను. ఆయన అనారోగ్యంతో ఉండటం నేను పెద్దగా చూడలేదుని తెలిపారు. అలాగే, తన తండ్రి సంరక్షణను చూసుకోవడానికి ఆస్పత్రిలో ఉండగా, .తన కుమారుడు తన మొదటి బోర్డు పరీక్ష రాస్తూ ఇంట్లో ఉన్నాడనీ, అతని పేపర్లు-పరీక్ష గురించి, ప్రిపరేషన్ గురించి కూడా అడగలేక పోయానని అన్నారు. ఆసుపత్రిలో ఒత్తిడి భయంతో సందర్శకులను పరిమితం చేసినప్పుడు, మేము వచ్చే సందర్శకుల గురించి (ఉమెన్ చాందీని చూడలేకపోతే) ఆయనకు సమాచారం ఇవ్వడంతో పాటు ఆయన తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తామని పేర్కొన్నారు.
అయితే కేంద్రమంత్రి వి.మురళీధరన్ వస్తున్నారని తెలియగానే ఆయన బలహీనంగా ఉన్నప్పటికీ మంత్రిని వ్యక్తిగతంగా కలవాలని పట్టుబట్టారనీ, తాను సంరక్షకుడిగా ఉండటంతో వారి సంభాషణ సమయంలో అక్కడే ఉన్నానని తెలిపారు. అల్లర్లతో అతలాకుతలమైన యెమెన్ లో కోర్టు విధించిన మరణశిక్షలో క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్న నిమిషా ప్రియ గురించి మంత్రిని కలిసి ఆరా తీయడంతో అప్పా చాలా సంతోషించారనీ, అన్ని వివరాలు అడిగి తెలుసుకుని మంత్రితో 10 నిమిషాలకు పైగా మాట్లాడి కేసు స్థితిగతులను తెలుసుకున్నారని పేర్కొన్నారు. ప్రియ తన 8 ఏళ్ల కుమార్తె, కుటుంబంతో తిరిగి కలవడానికి సహాయం చేయాలని ఆయన మంత్రిని అభ్యర్థించినట్టు కూడా తెలిపారు.
"ప్రియ-ఆమె కుటుంబ కష్టాల గురించి లోతైన సంభాషణలో అప్పాను చూస్తున్నప్పుడు నేను నా భావోద్వేగాలతో పోరాడుతున్నాను. అతను తన గురించి లేదా తన స్వంత ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు.. నిజమైన ప్రజా సేవకుడి మనస్సు ఎల్లప్పుడూ అతను ప్రేమించే..సేవ చేయాలనుకునే ప్రజలతోనే ఉంటుందని నేను గ్రహించాననీ" మరియా తన పోస్టులో పేర్కొన్నారు. తాను ఎంతగానో ప్రేమించే ప్రజలకు సేవ చేయడానికి అప్పా త్వరలోనే సాధారణ జీవితానికి తిరిగి వస్తారనే భరోసా తనకు కలిగిందనీ, ఆయన కూతురిగా నేనెంత అదృష్టవంతురాలినో మరోసారి తెలుసుకున్నప్పుడు తన హృదయం ఉప్పొంగిందని పేర్కొన్నారు.