
న్యూఢిల్లీ : ఓ పదిహేడేళ్ల బాలుడు తాను ఓ వ్యక్తిని హత్య చేయబోతున్నట్లు ఇన్ స్టా లైవ్ లో తెలిపాడు. అంతేకాదు జనాల్లో తన మీద భయాన్ని కలిగించడానికి జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌తో తనకున్న అనుబంధం గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఈ బాలుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి అంతకు ముందు నాలుగు కేసులతో సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. శుక్రవారం పోలీసులు ఈ వివరాలు తెలిపారు.
ఇటీవలే 18 ఏళ్లు నిండిన ఆ బాలుడు. కొద్ది రోజుల్లోనే ఆ బాలుడు ఈశాన్య ఢిల్లీలో కాల్పులు, దోపిడీలకు పాల్పడే ముఠాకు నాయకత్వం వహించాడని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దృష్టిని ఆకర్షించేందుకు ఈ ముఠా ఎలాంటి కారణం లేకుండా అమాయకులపై కాల్పులు జరుపుతూ ఉండేది. ముఠాలోని ఒక సభ్యుడు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడితో టచ్‌లో ఉన్నట్లు గొప్పగా చెప్పుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసే వాలా హత్యలో ఢిల్లీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రమేయం ఉంది.
అతను ఎవరిని చంపాలనుకున్నాడో ఆ వ్యక్తి గుర్తింపును బహిర్గతం చేయడం ద్వారా, బాలుడు పోలీసులను సవాలు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడతీ అధికారులు తెలిపారు. 2007 యాక్షన్ థ్రిల్లర్ షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలాలో భయంకరమైన గ్యాంగ్‌స్టర్ మాయ డోలాస్‌లో నటుడు వివేక్ ఒబెరాయ్ పాత్ర ద్వారా ఆ బాలుడు ఇన్ స్పైర్ అయ్యాడట.
ఈ ముఠా 302, 307 వంటి ఇన్ స్టా గ్రాం ఐడీలను ఉపయోగించింది, ఇవి భారతీయ శిక్షాస్మృతి ప్రకారం హత్య, హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్లు. రెండు రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పేర్కొన్న వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆ బాలుడిని పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ లోని వారిలో ఒకరిని ఆ వ్యక్తి ఇటీవల కొట్టాడు. దీంతో ఆ వ్యక్తిని తుపాకీతో కాల్చివేయాలని ముఠా ప్లాన్ చేసి, దాన్ని వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఘజియాబాద్‌లోని లోనిలో ఉండే ఈ బాలుడు 7వ తరగతి వరకు చదువుకున్నాడని.. ఆ తరువాత డ్రాపవుట్ అని తేలింది. బాలుడిని నవంబర్ 2021లో ఒక హత్యకు సంబంధించి ఒకసారి అరెస్టు చేశారు. అయితే జువైనల్ జస్టిస్ బోర్డ్ కేసును పరిష్కరించిన తర్వాత ఆ సంవత్సరం విడుదలయ్యాడని పోలీసు అధికారులు తెలిపారు. విడుదలైన తర్వాత, బాలుడు మరో ఇద్దరు మైనర్ బాలురితో కలిసి ఓ ముఠాగా ఏర్పడి తన నేర కార్యకలాపాలను కొనసాగించాడు. ఓ సారి పోలీసులతో ఎదురుకాల్పుల్లో కూడా పాల్గొన్నాడు.