
రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ 11 రోజుల పాటు కఠిన ఉపావాసం చేశానని చెబుతున్నారని, అయితే ఈ విషయంలో తనకు అనుమానం ఉందని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. మంగళవారం మొయిలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఒక డాక్టర్ తో మార్నింగ్ వాక్ చేశాను. ఆ సమయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు.. ఒక వ్యక్తి కేవలం కొబ్బరి నీళ్లతో 11 రోజులు బతకడం సాధ్యం కాదని చెప్పారు. అయితే ఆయన (ప్రధాని మోడీ) బతికి ఉంటే అద్బుతం. అందువల్లే ఆయన ఉపావాసం చేశారా లేదా అనేది నాకు అనుమానంగా ఉంది’’ అని అన్నారు.
రూ.2, రూ.5 కాయిన్లు ఉంటే లక్షాధికారులు.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏం చెప్పిందంటే..?
అయితే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ ఎంపీ లహర్ సింగ్ సిరోయా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ‘‘గొప్ప రచయిత ముసుగు ధరించి తిరిగే వీరప్ప మొయిలీ తనలాగే అందరూ ఫేక్ అని భావిస్తారు. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ దీక్ష చేయడంపై మొయిలీ అనుమానం వ్యక్తం చేశారు. దేశానికి నిజం తెలుసు’’ అని అన్నారు.
రాముడిపై నమ్మకం ఉంటే ఉపవాసం చేసి బతకవచ్చని లహర్ సింగ్ సిరోయా అన్నారు. కానీ కేవలం గాంధీ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకుంటే బతకలేరని అన్నారు. కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఈ ప్రయత్నం చేశారని అన్నారు. కానీ మొయిలీకి చిక్కబళ్లాపూర్ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వబోదని జోస్యం చెప్పారు.
తొలిరోజే అయోధ్య రామయ్య అద్భుత రికార్డు... ఏకంగా 5 లక్షలమందా...!
కాగా.. అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ 11 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన నేలమీద నిద్రపోయారు. 11 రోజుల పాటు పూజలు చేశారు. ఉపవాస సమయంలో ఆవును జపం చేసి పూజించారు. కొబ్బరినీళ్లు మాత్రమే తాగే వారు. 4 రాష్ట్రాల్లో రామాయణానికి సంబంధించిన 7 ఆలయాలను కూడా మోడీ సందర్శించి పూజలు చేశారు.
Narendra Modi YouTube channel: గత రికార్డులను బ్రేక్ చేసిన 'నరేంద్ర మోదీ'యూట్యూబ్ ఛానెల్ ..
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట పూర్తయిన తరువాత శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ సమర్పించిన 'చరణామృత్' (ఆచారాలకు ఉపయోగించే పాలతో చేసిన తీపి పానీయం) తాగి ప్రధాని మోడీ తన ఉపవాసాన్ని ముగించారు. అయితే ఈ ఉపవాసంపై కాంగ్రెస నేత, కేంద్ర మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.