లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం కష్టమే: పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సంచలనం

By telugu teamFirst Published Dec 2, 2021, 1:23 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 సీట్లను గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని తాను భావించడం లేదని అన్నారు. 300 సీట్లను గెలుచుకోవాలని కోరుకుంటున్నారని, కానీ, అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదని వివరించారు. జమ్ము కశ్మీర్‌లో ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు. వాటిని రద్దు చేసిన ప్రభుత్వమే మళ్లీ పునరుద్ధరిస్తుందని భావించడం లేదనీ చెప్పారు.
 

న్యూఢిల్లీ: Congress సీనియర్ నేత గులాం నబీ ఆజాద్(Gulam Nabi Azad) మరోసారి దుమారం రేపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తాను భావించడం లేదని సంచలనం సృష్టించారు. 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో(Lok Sabha Elections) కాంగ్రెస్ మెజార్టీ సాధించి 300 మంది ఎంపీలతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు తనకు కనిపించడం లేదని అన్నారు. కాంగ్రెస్ గెలువాలని కోరుకుంటున్నారని అన్నారు. కానీ, 300 మంది సీట్లను గెలిచే లక్ష్యాన్ని కాంగ్రెస్ సాధిస్తుందని అనుకోవడం లేదని, ఇప్పుడు అయితే తనకు ఆ పరిస్థితులు కనిపించడం లేదని స్పష్టం చేశారు. Jammu Kashmirలోని పూంచ్ జిల్లాలో ఓ సదస్సులో ఆయన పాల్గొని మట్లాడారు. పూంచ్‌లో Article 370 రద్దు ఒక ప్రధానమైన అంశంగా ఉన్నది.

ఆర్టికల్ 370 రద్దు గురించి పార్లమెంటులో మాట్లాడటం లేదని కొందరు అనుకుంటున్నారని, కానీ, ఏళ్లపాటు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తింది తానేనని, మరెవరూ దీనిపై మాట్లాడలేదని గులాం నబీ ఆజాద్ అన్నారు. కానీ, ఈ అంశం ఎప్పుడైతే సుప్రీంకోర్టు ముందుకు వెళ్లిందో అప్పటి నుంచే తాను ఏమీ మాట్లాడటం లేదని వివరించారు. ఎందుకంటే తన చేతుల్లో లేని విషయాల గురించి మాట్లాడి ప్రజలను మభ్య పెట్టడం తనకు ఇష్టం లేదని అన్నారు. చుక్కలను తెస్తానని, మరణించిన వారి ప్రాణాలు మళ్లీ ఇస్తానని మాట్లాడాల్సిన అవసరం లేదని వివరించారు.

Also Read: కేంద్రంపై గులాం నబీ ఆజాద్ తీవ్ర విమర్శలు.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై నీలినీడలు!

ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం పదవి అనేది తన దృష్టిలో విలువలేనిదని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇప్పుడు కశ్మీరీల అందరి ముందు ఉన్నది భూమి, ఉద్యోగాల అంశమేనని వివరించారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న 370 రద్దు గురించి తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదని, కానీ అప్పటి కశ్మీరీల భూమి, ఉద్యోగాలు ఇతరులకు వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదనీ అన్నారు. ఇప్పుడు కేవలం సుప్రీంకోర్టు మాత్రమే 370 ఆర్టికల్‌పై నిర్ణయం తీసుకోగలదని, అది మినహాయిస్తే మళ్లీ అధికారంలోని ప్రభుత్వానికే ఆ అధికారం ఉన్నదని తెలిపారు. కానీ, ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే దాన్ని రద్దు చేసినప్పడు మళ్లీ ఎందుకు పునరుద్ధరిస్తుందని ప్రశ్నించారు.

ఇదే సందర్భంగా 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పుంజుకోవడంపై ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికల తర్వాత 300 మంది ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాను భరోసా ఇవ్వలేనని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 300 సీట్లు గెలుచుకోవాలని కోరుకుంటున్నారని, కానీ, అది జరుగుతుందని ఇప్పుడు తాను అనుకోవడం లేదని వివరించారు.

Also Read: గులాం నబీ ఆజాద్‌కి వీడ్కోలు: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణం 379, 35ఏలను రద్దు చేసింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అదే సమయంలో జమ్ము కశ్మీర్‌లో వ్యతిరేకతను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించింది. అదే తరుణంలో 370 రద్దుపై సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు నమోదయ్యాయి. ఇవన్నీ ఇప్పుడ సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయి.

click me!