కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ గురువారం నాడు ఆయా రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసకోవాల్సిన చర్యలపై ఆయన దిశా నిర్ధేశం చేశారు.
న్యూఢిల్లీ: దేశంలో Omicron వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం దృష్టి సారించింది. మహారాష్ట్రలో విదేశాల నుండి వచ్చిన ఆరుగురికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గురువారం నాడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి Mansukh Mandaviya ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై చర్చించారు.ఇవాళ Loksabha ప్రారంభానికి ముందు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో చర్చించారు. ప్రతి ఒక్కరూ Corona రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఆయా రాష్ట్రాలను కోరారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు. దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా రాష్ట్రాలతో కేంద్ర మంత్రి చర్చించారు.
ఒమిక్రాన్ వైరస్ దక్షిణాఫ్రికా దేశంలో నవంబర్ 24న వెలుగు చూసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. డెల్లా వేరియంట్ కంటే ఈ వైరస్ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఆయా రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. యూపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన ప్రయాణీకులను హోం ఐసోలేషన్ లో ఉంచుతామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి రైల్వే, బస్ స్టేషన్లలో వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి ప్రయాణీకులను వైద్య సిబ్బంది పరీక్షించనున్నారు.మరో వైపు ఒమిక్రాన్ పై కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. అంతేకాదు విదేశీ ఫ్లైట్స్ పై నిషేధం విధించింది.