ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు: కర్ణాటక బస్సు ప్రమాదంపై బస్సు డ్రైవర్

Published : Jun 03, 2022, 01:18 PM ISTUpdated : Jun 03, 2022, 03:32 PM IST
ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు: కర్ణాటక బస్సు ప్రమాదంపై బస్సు డ్రైవర్

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి జిల్లా కమలపురా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. రెండో డ్రైవర్ బస్సు నడిపే స.మయంలో ఈ ప్రమాదం జరిగిందని బస్సు మొదటి డ్రైవర్ చెప్పారు.ఈ ప్రమాదంలో మొదటి డ్రైవర్ కూడా మరణించినట్టుగా చెబుతున్నారు.

హైదరాబాద్: సెకండ్ Driver బస్సును నడుపుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. హైద్రాబాద్ నుండి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును గోవాకు టెక్కీ Arjun kumar కుటుంబం బుక్ చేసుకొన్నట్టుగా తెలిసింది. 

Karnataka రాష్ట్రంలోని kalaburagi జిల్లా kamalapura వద్ద శుక్రవారం నాడు జరిగిన Road accidentలో హైద్రాబాద్ కు చెందిన ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి Goa నుండి Hyderabad కు బస్సు బయలుదేరింది. ఇవాళ తెల్లవారుజాము సమయంలో రాత్రి నుండి బస్సును నడుపుతున్న డ్రైవర్ సెకండ్ డ్రైవర్ కు బస్సును అప్పగించాడు. అయితే సెకండ్ డ్రైవర్ బస్సును తీసుకున్న కొద్దిసేపటికే ప్రమాదం చోటు చేసుకొంది. టెంపో ట్రాక్స్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకంది. టెంపో వాహనం ట్రావెల్స్ బస్సు డీజీల్ ట్యాంక్ ను బలంగా ఢీ కొట్టింది.దీంతో రోడ్డు పక్కనే ఉన్న చిన్న లోయలో బస్సు పడిపోయింది. వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ బస్సు నుండి స్థానికులు 12 మందిని రక్షించారు. ఫైరింజన్లకు సమాచారం అందించారు.  ఫైరింజన్లు సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పాయి. అయితే అప్పటికే బస్సులోని 8 మంది సజీవ దహనమయ్యారు.

also read:కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు, టెంపో ఢీకొని ఎనిమిది మంది హైద్రాబాద్ వాసుల మృతి

తాను సెకండ్ డ్రైవర్ కు బస్సును అప్పగించిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ మీడియాకు చెప్పారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ తో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను నిద్రపోతున్నానని చెప్పారు. ఈ ప్రమాదంలో తనకు గాయాలైనట్టుగా ఆయన చెప్పారు. ఆసుపత్రిలో తాను చికిత్స పొందుతున్నట్టుగా ఆయన చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో తనకు తెలియదన్నారు.

ఇవాళ ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. కలబురిగి జిల్లా కమలాపురా పట్టణ శివార్లలో ఈ ప్రమాదం జరిగింది.  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టెంపో ట్రాక్స్ ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి.  బస్సు గోవా నుండి హైద్రాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కలబురిగిలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో 12 మందిని రక్షించారు. ఈ ఘటనలో చనిపోయిన వారు హైద్రాబాద్ కు చెందినవారుగా అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ సహా 35 మంది ఉన్నారుహైద్రాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగి అర్జున్ తన కూతురు బర్త్ డే వేడుకలకు గాను బంధువులు, స్నేహితులతో కలిసి గోవా వెళ్లినట్టుగా సమాచారం. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.ఈ ఘటనలో మరణించిన వారిని అర్జున్, సరళ, శివకుమార్, రవళి, దీక్షిత్,అర్జున్, అనితతో మరొకరు మరణించారు. బస్సులోని 35 మందిలో ఒకే కుటుంబానికి చెందిన వారు 25 మంది ఉన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !