నాకు హిందీ, ఇంగ్లీష్ పెద్దగా రాదు.. వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

Published : Apr 05, 2023, 12:59 PM IST
నాకు హిందీ, ఇంగ్లీష్ పెద్దగా రాదు.. వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

సారాంశం

తనకు హిందీ, ఇంగ్లీష్ పెద్దగా రాదని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఆ భాషలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాని చెప్పారు. తాను చిన్నప్పటి నుంచి అస్సాం మీడియంలోనే చదువుకున్నానని తెలిపారు. 

తనకు ఇంగ్లీష్, హిందీ పరిజ్ఞానం తక్కువని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ  అంగీకరించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అస్సాంలోని ఓ పాఠశాల సందర్శకుల పుస్తకాన్ని నింపేందుకు అంతకు ముందే రాసి సిద్ధంగా ఉన్న టెక్స్ట్ నుంచి శర్మ కాపీ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలపై స్పందించిన అస్సాం సీఎం..తనకు హిందీ, ఇంగ్లీష్ పెద్దగా రాదని, ఆ రెండు బాషలపై పట్టు సాధించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.

Mumbai Airport: ప్రయాణికులకు గమనిక! ఆ రోజు మూతపడనున్న ముంబై విమానాశ్రయం.. ఎందుకంటే..?

అస్సాం సీఎం విజిటర్స్ రిజిస్టర్ లో రాస్తున్న వీడియోను రోషన్ రాయ్ అనే వ్యక్తి గురువారం ట్వీట్ చేశారు. ‘‘కాపీ కొట్టకుండా సందర్శకుల పుస్తకంలో ఒక్క పేరాగ్రాఫ్ కూడా రాయలేని అసోం సీఎంను ప్రెజెంట్ చేస్తున్నాను’’ అని దానికి క్యాప్షన్ పెట్టారు. దీనిపై సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించారు. తాను అస్సామీ మీడియం స్కూల్ కు వెళ్లి చదువుకున్నానని చెప్పారు. హిందీ, ఇంగ్లీష్ భాషలను వినమ్రంగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాని తెలిపారు. ‘‘నాకు ఇంగ్లీష్, హిందీ పెద్దగా రాదని ఒప్పుకోవాలి. దానిని అంగీకరించడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు.’’ అని ఆయన పేర్కొన్నారు.

శర్మ వ్యాఖ్యలపై ట్విట్టర్ యూజర్లు మిశ్రమంగా స్పందించారు. అస్సాం సీఎం వ్యాఖ్యలపై కాలమిస్ట్, రచయిత వికాస్ సారస్వత్ స్పందిస్తూ.. ఆ నిజాయితీ, నిర్మొహమాటత్వమే రాజనీతిజ్ఞులను, రాజకీయ నాయకులను వేరు చేస్తుందని పేర్కొన్నారు. మరో ట్విటర్ యూజర్ సిద్ధార్థ్ జైన్ కూడా.. శర్మ నిజాయితీగా సమాధానం ఇచ్చారని ప్రశంసించారు.

ఏప్రిల్ 25నుంచి కేదార్ నాథ్ యాత్ర ప్రారంభం.. అందుబాటులో హెలికాప్టర్ సేవలు..

‘‘నిజాయితీగా నేర్చుకునే మనస్తత్వాన్ని ప్రదర్శించినందుకు హిమంత బిశ్వ శర్మకు ధన్యవాదాలు. ఒక నాయకుడిలో ప్రజలు వీటిని నిజంగా గౌరవిస్తారు’’ అని జైన్ పేర్కొన్నారు. కాగా.. శర్మపై కొందరు మండిపడ్డారు. ఆయన స్పందనకు సమాధానం ఇస్తూ.. వ్యాకరణ దోషాలు లేకుండా ఈ ట్వీట్ రాయడానికి మీకు ఎవరు సహకరించారు అని అభిషేక్ జి భయా అనే యూజర్ కామెంట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?