
ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన ఎయిర్ పోర్టులలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటి. ప్రతిరోజూ దాదాపు 900 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం బిజీబిజీగా ఉండే.. అదానీ గ్రూప్ యాజమాన్యంలోని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రెండు రన్‌వేలు తాత్కాలికంగా ముసివేయబడుతున్నాయి.
నిర్వహణ పనుల్లో భాగంగా.. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA)లోని రెండు రన్‌వేలు - RWY 09/27 , 14/32 రన్ వేలను దాదాపు 6 గంటల పాటు మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఆపరేటింగ్ కంపెనీ ప్రకటన ప్రకారం.. ముంబై విమానాశ్రయం .. మే 2, 2023 నాడు ఉదయం 11:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తాత్కాలికంగా మూసివేయబడుతుంది . దీనికి సంబంధించి NOTAM (ఎయిర్‌మెన్‌కు నోటీసు)ను అధికారులు జారీ చేశారు.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం అదానీ గ్రూప్ యాజమాన్యంలో రెండు క్రాసింగ్ రన్‌వేలు ఉంటాయి అవి RWY 09/27, 14/32. వర్షాకాలానికి ముందు నిర్వహణ , మరమ్మతు పనుల్లో భాగంగా మే 2న రెండు రన్‌వేలు తాత్కాలికంగా ముసివేయనున్నారు.
CSMIA ఆరు నెలల ముందుగానే సంబంధిత వాటాదారులందరికీ తెలియజేసిందని, దీంతో విమానయాన సంస్థలు తమ విమాన షెడ్యూల్‌లను ప్లాన్ చేసుకోవడంలో కూడా సహాయపడిందని తెలిపింది. మే 2న సాయంత్రం 5 గంటల నుంచి అన్ని కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.