నిర్భయ దోషులకు ఉరిశిక్ష: ఏడేళ్ల పోరాటం ముగిసిందన్న నిర్భయ తల్లీ

By Siva KodatiFirst Published Jan 7, 2020, 5:54 PM IST
Highlights

నిర్భయ దోషులకు న్యాయస్థానం ఉరిశిక్షను అమలు చేయాల్సిందిగా ఆదేశించడంపై ఆమె తల్లి హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిర్భయకు న్యాయం జరిగేందుకు ఏడేళ్ల నుంచి చేస్తున్న పోరాటం నేటితో ముగిసిందన్నారు

నిర్భయ దోషులకు న్యాయస్థానం ఉరిశిక్షను అమలు చేయాల్సిందిగా ఆదేశించడంపై ఆమె తల్లి హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిర్భయకు న్యాయం జరిగేందుకు ఏడేళ్ల నుంచి చేస్తున్న పోరాటం నేటితో ముగిసిందన్నారు.

ఈ తీర్పు వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని, తన బిడ్డతో పాటు దేశంలోని ఎంతో మంది ఆడపిల్లలకు న్యాయం జరిగిందని ఆశా దేవి తెలిపారు. కోర్టు తీర్పు కారణంగా ఇలాంటి నేరాలకు పాల్పడాలంటేనే వణుకు మొదలవుతుందని ఆశా దేవి అభిప్రాయపడ్డారు. కాగా కోర్టు తీర్పుకు ముందు దోషుల్లో ఒకరైన ముఖేశ్ తల్లీ, నిర్భయ తల్లీ వద్దకు వెళ్లి దోషులను క్షమించి వారి ప్రాణాలను కాపాడమని కోరారు. 

Also Read:నిర్భయ దోషులకు మరణశిక్ష: ఉరితీసేది ఈ తేదీనే

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ నిందితులకు మరణశిక్ష ఎప్పుడనే దానిపై ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 22న నిర్భయ నిందితులకు ఉరిశిక్షను విధించాల్సిందిగా ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆ రోజున ఉదయం 7 గంటల లోపు నలుగురు దోషులను ఉరి తీయాల్సిందిగా కోర్టు తీహార్ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నలుగురు దోషులకు సుప్రీంకోర్టు గతంలోనే ఉరిశిక్ష విధించింది.

Also Read:నిర్భయ దోషులకు ఉరి... ఈసారి డేట్ ఫిక్స్

దీంతో దోషులు నలుగురు తమపై కరుణ చూపాలని, శిక్షను తగ్గించాల్సిందిగా  కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు మీరు చేసింది చాలా దారుణమైన, క్రూరమైన నేరం కాబట్టి, మీకు పిటిషన్ వేసే అర్హత కూడా లేదని చెప్పి వ్యాజ్యాన్ని కొట్టివేసిన సంగతి తెలిసిందే.

click me!